Rakshashudu 2: బెల్లంకొండ శ్రీనివాస్ 'రాక్షసుడు' సినిమాకు త్వరలో సీక్వెల్.. డైరెక్టర్ రమేష్ వర్మ క్లారిటీ..!

Updated on Aug 06, 2022 02:23 PM IST
'రాక్షసుడు' (Rakshasudu) సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ఈ సినిమాపై డైరెక్టర్ రమేష్ వర్మ(Ramesh Varma) క్లారిటీ ఇచ్చారు.
'రాక్షసుడు' (Rakshasudu) సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి ఈ సినిమాపై డైరెక్టర్ రమేష్ వర్మ(Ramesh Varma) క్లారిటీ ఇచ్చారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas ), అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ కాంబినేష‌న్‌లో తెరకెక్కిన చిత్రం రాక్ష‌సుడు (Rakshashudu). తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాచ్చసన్' సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా, తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. బాక్సాఫీసు వ‌ద్ద నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. 

ఆడపిల్లలను వరుసగా హత్యలు చేసుకుంటూ వెళ్లే ఓ సైకో కిల్లర్ కథ ఇది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్‌కి గురి చేసింది. అంతేకాదు వరుసగా ఫ్లాప్స్‌తో ఉన్న సాయి శ్రీనివాస్, ఈ సినిమాతోనే ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక, ఇప్ప‌టికే ర‌మేశ్ వర్మ (Ramesh Varma) 'రాక్ష‌సుడు 2'ను కూడా ప్ర‌క‌టించాడు. టైటిల్‌తోపాటు 'శ్వాస‌ను ఆపుకోండి' అంటూ ట్యాగ్ లైన్ కూడా పోస్టర్‌కి యాడ్ చేశాడు. అయితే ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ కూడా ఇవ్వకపోవడం గమనార్హం. 

ఇటీవలే 'రాక్షసుడు' సినిమా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా. మరొకసారి ఈ సినిమాపై డైరెక్టర్ రమేష్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ‘రాక్షసుడు 2‘ (Rakshasudu 2) సినిమా ఓ డబుల్ థ్రిల్లర్. ఇంకా ఎక్కువ సస్పెన్స్‌తో తీయడానికి చాలా ఎక్సైట్ గా ఉన్నాము. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నాము‘ అంటూ రమేష్ వర్మ వెల్లడించారు. ఇక ఈ సీక్వెల్‌ని కూడా ‘రాక్షసుడు‘ సినిమాను ప్రొడ్యూస చేసిన హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ఏ స్టూడియోస్‘ అధినేత కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

‘రాక్షసుడు 2‘ సినిమాకు జిబ్రాన్ (Ghibran) సంగీతం అందిస్తున్నారు. వెంకట్ సి.దిలీప్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తిస్తుండగా, శ్రీకాంత్ విస్సా, రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ తమ్ముడు సాగర్‌ ఈ సినిమాకు సంభాషణలను అందిస్తున్నారు. అయితే ‘రాక్షసుడు 2‘  చిత్రంలో ఈసారి కూడా హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్‌ నటిస్తారా? లేదా వేరే స్టార్‌ హీరోతో ఈ ప్రాజెక్టును తెరకెక్కిస్తారా? అన్నది తెలియదు. ప్రేక్షకులు ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చేవరకు ఎదురు చూడక తప్పదు.

Read More: కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!