Chor Bazaar Movie Review: వినోదాత్మకంగా ఆకాష్ పూరీ (Akash Puri) ‘చోర్‌‌ బజార్’.. బచ్చన్‌సాబ్‌గా అదరగొట్టిన హీరో !

Updated on Jun 24, 2022 07:17 PM IST
ఇది వరకూ ఏ దర్శకుడూ టచ్ చేయని ‘చోర్ బజార్’ కాన్సెప్ట్‌కు , నిజాం డైమండ్‌కు లింక్ పెట్టి.. దర్శకుడు జీవన్ రెడ్డి ఆసక్తికరంగా కథ రాసుకున్నాడు.
ఇది వరకూ ఏ దర్శకుడూ టచ్ చేయని ‘చోర్ బజార్’ కాన్సెప్ట్‌కు , నిజాం డైమండ్‌కు లింక్ పెట్టి.. దర్శకుడు జీవన్ రెడ్డి ఆసక్తికరంగా కథ రాసుకున్నాడు.

పూరీ జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరీ (Akash Puri) హీరోగా తెరకెక్కిన కొత్త సినిమా ‘చోర్ బజార్’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రొమాంటిక్, మెహబూబా సినిమాల్లో హీరోగా నటించి మెప్పించిన ఆకాష్‌.. ఈసారి బచ్చన్‌ సాబ్‌గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక జార్జి రెడ్డి సినిమాతో టాలెంట్‌ను నిరూపించుకున్న దర్శకుడు జీవన్‌ రెడ్డి.. ఆకాష్‌ను ఎలా చూపించాడో తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

కథేంటంటే..

హైదరాబాద్‌లో దొంగ సామాన్లు అమ్మే ఏరియా చోర్ బజార్. ఆ ఏరియా మొత్తం బచ్చన్ సాబ్ (ఆకాష్‌ పూరీ) కంట్రోల్‌లో ఉంటుంది. సిమ్రాన్ (గెహానా సిప్పీ) అనే మూగమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తుంటాడు హీరో. సిమ్రాన్‌కి కూడా బచ్చన్‌ సాబ్‌ అంటే ఇష్టం. బచ్చన్ సాబ్ తల్లిగా అర్చన నటించారు.

బచ్చన్ సాబ్ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంటుంది. అదే సమయంలో సిటీలోని ఒక మ్యూజియమ్‌లో రూ.200 కోట్లు విలువ చేసే నిజాం వజ్రం ఒకటి మిస్ అవుతుంది.

అది ఎవరు కొట్టేశారు? బచ్చన్ సాబ్ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? లేదా? చోర్ బజార్‌‌ను క్లోజ్‌ చేయించాలని అనుకున్న గబ్బర్ సాబ్ (సుబ్బరాజు) కథేంటి ?  ఆ వజ్రానికి, హోమ్ మినిస్టర్ కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది మిగిలిన కథ.

చోర్‌‌ బజార్ సినిమా పోస్టర్

రివ్యూ..

రోబరీ, హైస్ట్ కథలతో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయి. ఒక విలువైన వజ్రం,  రాయి లేదా విగ్రహం మ్యూజియం నుంచి మిస్ కావడం అనేది ఇలాంటి చిత్రాలలో కనిపించే ప్రధానాంశం. అలాగే  ఈ ఖరీదైన వస్తువులు దొంగల చేతుల్లోంచి  మిస్‌ అయ్యి ఎక్కడెక్కడికో ట్రావెల్ చేయడం కూడా  ఇలాంటి చిత్రాలలో సర్వసాధారణమే. ఆఖరికి అలా మిస్ అయినవి చివరికి హీరో చేతికి చిక్కడం, హీరో దానిని పోలీసులకు అప్పగించడం అనేవి రెగ్యులర్ క్లైమాక్స్‌ని తలపిస్తాయి. ‘స్వామి రారా, మరకతమణి’ వంటి సినిమాలు అలాంటి కథాంశాలతోనే తెరకెక్కి ప్రేక్షకుల్ని మెప్పించాయి.

అయితే ఇది వరకూ ఏ తెలుగు దర్శకుడూ టచ్ చేయని ‘చోర్ బజార్’ కాన్సెప్ట్‌కు , నిజాం డైమండ్‌కు లింక్ పెట్టి.. దర్శకుడు జీవన్ రెడ్డి ఈసారి ఆసక్తికరంగా కథను రాసుకున్నాడు. దాన్ని పూర్తి స్థాయిలో కాకున్నా.. వీలైనంత వరకూ వినోదాత్మకంగా తెరకెక్కించాడు. ఆ విధంగా ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌‌టైన్‌ చేశాడని చెప్పుకోవచ్చు. మ్యూజియంలోని డైమండ్ దొంగతనం సీన్‌తో సినిమాను ఆసక్తికరంగా మొదలు పెట్టడమే అందుకు ఉదాహరణ.

ఆ డైమండ్ విలువ తెలియని వారి చేతుల్లోకి అది వెళ్లి చేరేలా.. కథను మలిచాడు దర్శకుడు.  ఇదే క్రమంలో, చివరికి ఆ డైమండ్ ఎవరి చేతుల్లోకి వెళుతుంది? అనే ఉత్కంఠను ప్రేక్షకుడిలో రేకెత్తించగలిగాడు.

ఇటువంటి క్రైమ్ కాన్సెప్ట్‌ను మరీ సీరియస్‌గా కాకుండా.. కామెడీ యాంగిల్‌లో ఆవిష్కరించి ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్ చేశాడు. ఆ విధంగా దర్శకుడు కొంత మేరకు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సినిమాలో దాదాపు అన్ని పాత్రలతోనూ వినోదాన్ని పంచడానికి ప్రయత్నించాడు దర్శకుడు జీవన్ రెడ్డి. అదే సమయంలో జబర్దస్త్ షోలో కామెడీ చేసే నవీన్‌తో మాత్రం ఎమోషనల్ క్యారెక్టర్‌‌ చేయించాడు. సినిమాలో హీరో ఫ్రెండ్స్‌ కూడా  తమ పాత్రలలో బాగానే మెప్పించారు. ‘చోర్ బజార్’ నేపథ్యంలో కోర్టులో హీరో చెప్పే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి.

హీరో, హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ఫ్రెష్‌గా ఉంది. హీరోయిన్‌ మూగమ్మాయి కావడంతో తన భావాలను టేప్‌ రికార్డర్‌‌ ద్వారా హీరోకి చెప్పే సీన్లు బాగున్నాయి. ఆమె చేసిన డబ్‌ స్మాష్‌ వీడియోలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

చోర్‌‌ బజార్ సినిమా పోస్టర్

ఆకాష్‌ పూరీ ఎలా నటించాడంటే..

బచ్చన్ సాబ్‌ పాత్రలో ఆకాశ్ పూరీ (Akash Puri) అదరగొట్టాడు. ఎమోషనల్ సీన్స్, కోర్టు సన్నివేశాల్లో బాగా నటించాడు. హీరోయిన్ గెహానా సిప్పీ తెరపై అట్రాక్టివ్‌గా కనిపించింది. హీరో తల్లిగా నటించిన అర్చన.. తెలంగాణ స్లాంగ్‌తో అదరగొట్టింది.  హోం మినిస్టర్‌‌గా సునీల్.. మొదటిసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పి, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

సునీల్ క్యారెక్టర్‌‌ నెగెటివా? పాజిటివా ? అనేది క్లారిటీ ఇవ్వలేదు దర్శకుడు. సినిమా చివరిలో సునీల్ పాత్రకు ఎండింగ్ కూడా ఇవ్వలేదు. సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్‌ బాగుంది. క్రైమ్ థ్రిల్లర్స్‌ చూడాలనే ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు ‘చోర్‌‌ బజార్’ ఒక మంచి సినిమా చూసిన అనుభూతిని కలిగిస్తుంది.

Read More : Sammathame Movie Review (సమ్మతమే సినిమా సమీక్ష): కిరణ్ అబ్బవరం యాక్టింగ్ హైలెట్.. అయినా ఇదో సాదాసీదా ప్రేమకథే !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!