Lakshmi Manchu: 'మంచు లక్ష్మి బ‌ర్త్ డే స్పెష‌ల్'.. మంత్రగత్తెగా అద్భుత న‌ట‌న క‌న‌బ‌రిచిన మంచు వార‌మ్మాయి.

Updated on Oct 08, 2022 12:20 PM IST
త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).
త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు కూతురు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu) న‌ట‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. న‌టిగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్‌గా మంచు వారమ్మాయి వెండితెర‌తో పాటు బుల్లితెర‌పై కూడా సంద‌డి చేస్తున్నారు. ఓటీటీ షోల‌లో కూడా మంచు ల‌క్ష్మి దూసుకెళుతున్నారు.

న‌ట‌న‌లో ప్ర‌త్యేక‌త‌, కాస్ట్యూమ్స్‌లో వెరైటీ, ఇక యాంక‌రింగ్‌లో వినూత్నంగా వినోదం పంచుతూ ల‌క్ష్మి త‌న‌కంటూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. మంచు ల‌క్ష్మి పుట్టిన రోజు సంద్భంగా పింక్‌విల్లా స్పెష‌ల్ స్టోరి.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

తండ్రి వార‌స‌త్వం కొన‌సాగిస్తున్న కుమార్తె

మంచు ల‌క్ష్మి(Lakshmi Manchu) 1977 అక్టోబర్ 8న జన్మించారు. చెన్నెలో లక్ష్మి ప‌ద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివారు. హైదరాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నిఫ్ట్‌లో ఫ్యాషన్‌ డిజైనింగ్ కోర్సును అభ్య‌సించారు. ఆ త‌రువాత అమెరికా వెళ్లిన ముంచు ల‌క్ష్మి థియేటర్‌ ఆర్ట్స్ కోర్సులో శిక్ష‌ణ తీసుకున్నారు.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

తండ్రి మోహ‌న్ బాబు న‌టుడు కావడంతో మంచు ల‌క్ష్మి చిన్న‌నాటి నుంచి యాక్షింగ్‌పై ఆస‌క్తి పెంచుకున్నారు. అమెరికాలో థియేటర్ ఆర్ట్స్ కోర్స్ చేస్తున్న సమయంలోనే అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌ ‘లాస్‌ వేగాస్' లో నటించారు. 

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

హాలీవుడ్ సిరీస్‌తో ఎంట్రీ

'బోస్టన్‌ లీగల్‌', 'మిస్టరీ ఈఆర్‌', 'డెస్పరేట్‌ హౌస్‌వైఫ్స్‌' వంటి హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌లలో కూడా మంచు ల‌క్ష్మి న‌టించి మెప్పించారు. 'ద ఓడే', 'డెడ్‌ ఎయిర్‌', 'థాంక్యూ ఫర్‌ వాషింగ్' ఇంగ్లీష్‌ షార్ట్‌ఫిల్మ్‌లలో న‌టించారు. 

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

‘లక్ష్మీ టాక్ షో ‘తో మంచు ల‌క్ష్మి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ‘ప్రేమతో మీ లక్ష్మి' లాంటి షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వం వహించిన ‘అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

మంత్రగత్తె ‘ఐరేంద్రి'గా నటించి తెలుగు ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఈ సినిమాలో అద్భుత‌మైన న‌ట‌న‌కుగాను మంచు ల‌క్ష్మి ఉత్త‌మ ప్ర‌తినాయిక‌గా 2012 నంది పురస్కారము అందుకున్నారు.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

తండ్రితో క‌లిసి సినిమా

‘దొంగల ముఠా', ‘డిపార్ట్‌మెంట్‌', ‘ఉ కొడతారా? ఉలిక్కిపడతారా?', ‘గుండెల్లో గోదారి', ‘చందమామ కథలు', ‘దొంగాట', 'లక్ష్మీ బాంబ్ ,' W/O రామ్‌', 'మా వింత గాధ వినుమా' చిత్రాల్లో మంచు లక్ష్మి నటంచారు. ‘మేముసైతం' అనే టీవీ షో ద్వారా ఎంతో మందికి మంచు ల‌క్ష్మి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సాయం అందేలా చేశారు.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

న‌టిగా, హోస్ట్‌గానే కాకుండా నిర్మాత‌గా కూడా మంచు ల‌క్ష్మి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు. అగ్ని న‌క్ష‌త్రం సినిమాతో మంచు ల‌క్ష్మీ తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. తండ్రీకూతుళ్లు మోహన్‌బాబు, మంచు లక్ష్మి కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

కొత్త ఆలోచ‌న‌ల‌తో ముందుకు అమెరికా వాసి ఆండీ శ్రీనివాసన్‌ను  లక్ష్మీ మంచు (Lakshmi Manchu) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం 2006లో జ‌రిగింది. వీరికి ఓ కుమార్తె. పేరు విద్యా నిర్వాణ మంచు ఆనంద్. మంచు ల‌క్ష్మి ఓ యూట్యూబ్ ఛాన‌ల్ కూడా మొద‌లుపెట్టారు.

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు ఫ్యాష‌న్, ఫ్యామిలీ గురించిన అనేక విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌తో త‌న ఛాన‌ల్ ద్వారా పంచుకుంటున్నారు. త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా త‌న ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచువార‌మ్మాయి.

Read More: ఆహా ఓటీటీలో 'చెఫ్ మంత్రా' (Chef Mantra) సీజన్ 2 ఫుడ్ షో.. హోస్ట్ గా అలరించనున్న మంచు లక్ష్మీ (Manchu Lakshmi)

త‌న‌పై వ‌చ్చే ట్రోల్స్‌ను ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా .. ల‌క్ష్యంవైపే త‌న ప‌య‌నం అంటున్నారు మంచు ల‌క్ష్మి (Lakshmi Manchu).

మంచు లక్ష్మి మ‌రిన్ని సినిమాలు, టీవీ షోల ద్వారా ప్రేక్ష‌కుల‌కు వినోదం అందించాలని పింక్ విల్లా కోరుకుంటుంది. హ్యాపీ బ‌ర్త్ డే మంచు ల‌క్ష్మి.
పింక్ విల్లా
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!