మోహన్‌లాల్‌ (Mohanlal)కు షాక్.. ‘మాన్‌స్టర్’ (Monster) విడుదలపై నిషేధం విధించిన గల్ఫ్ దేశాలు!

Updated on Oct 18, 2022 02:22 PM IST
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘మాన్‌స్టర్’ (Monster) మూవీ రిలీజ్‌పై గల్ఫ్​ దేశాలు బ్యాన్ విధించాయని సమాచారం
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘మాన్‌స్టర్’ (Monster) మూవీ రిలీజ్‌పై గల్ఫ్​ దేశాలు బ్యాన్ విధించాయని సమాచారం

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) నటించిన ‘మాన్‌స్టర్’ (Monster) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ‘మాన్‌స్టర్’ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, ఈ లోపే గల్ఫ్ దేశాలు మోహన్‌లాల్‌కు షాకిచ్చాయి. ‘మాన్‌స్టర్’ ప్రదర్శనపై గల్ఫ్ దేశాలు నిషేధం విధించాయని సమాచారం. ఈ చిత్రంలో లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్‌జీబీటీక్యూ) కంటెంట్ ఉండటంతో బ్యాన్ వేసినట్లు తెలుస్తోంది. 

గల్ఫ్ దేశాల్లో ‘మాన్‌స్టర్’ నిషేధం విషయం తెలియడంతో చిత్ర నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ వెంటనే అలర్ట్ అయ్యారు. సెన్సార్ బోర్డును ఆయన సంప్రదించారని తెలిసింది. సినిమా కాపీని రీఎవాల్యుయేషన్ కోసం సెన్సార్ బోర్డుకు ఆంటోని అందించారని సమాచారం. ఒకవేళ బోర్డు నుంచి అనుమతి లభిస్తే వచ్చే వారం గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఈ వారం గల్ఫ్‌లో ‘మాన్‌స్టర్’ రిలీజ్ అయ్యే ఛాన్సుల్లేవని తెలుస్తోంది. 

ఇక, ‘మాన్‌స్టర్’ సినిమాలో మోహన్‌లాల్ లక్కీ సింగ్ అనే సిక్కు ఐపీఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథను ఉదయ్ కృష్ణ అందించగా.. వైశాఖ్ దర్శకత్వం వహించారు. గతంలో మోహన్‌లాల్‌తో ‘మన్యం పులి’ చిత్రాన్ని వైశాఖ్ తీశారు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కాగా, ‘మాన్‌స్టర్’లో ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మి కూడా నటించడం విశేషం. అలాగే హనీరోజ్, సుదేవ్ నాయర్, జానీ ఆంటోనీ, సిద్ధిఖ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రంతో మోహన్‌లాల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

Read more: అల్లు అర్జున్ (Allu Arjun), రామ్ చరణ్ (Ram Charan) కాంబోలో సినిమా ప్లానింగ్ చేస్తున్న అగ్ర నిర్మాత ఎవరంటే..!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!