'యద్భావం తద్భవతి' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్.. మరో వినూత్న కథా చిత్రంలో వరుణ్ సందేశ్ (Varun Sandesh)

Updated on Jul 21, 2022 10:01 PM IST
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో ఒకప్పుడు మంచి యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh)
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం లాంటి సినిమాలతో ఒకప్పుడు మంచి యూత్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh)

విభిన్న కథాంశాలు, పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh). ప్రస్తుతం ఆయన మరో వినూత్న కథతో తెరకెక్కిస్తున్న ‘యద్భావం తద్భవతి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

ప్రసన్న భూమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద ప్రసన్న లక్ష్మీభూమి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి  రమేష్ జక్కల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్‌కు జోడిగా ఇనయ సుల్తానా నటిస్తున్నారు. వరుణ్ సందేశ్ (Varun Sandesh) పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను యంగ్ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు.

కొత్త లుక్ అదుర్స్

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ కొత్తగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఆయన యాక్షన్ మోడ్‌లో మాస్ ఆడియెన్స్‌ను మెప్పించేలా ఉన్నారని తెలుస్తోంది. 

ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేసిన అనంతరం సందీప్ కిషన్ (Varun Sandesh) మాట్లాడుతూ.. ‘మైఖెల్ సెట్‌లో వరుణ్ సందేశ్ బర్త్ డే సందర్భంగా 'యద్భావం తద్భవతి' ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ పోస్టర్‌లో వరుణ్ సందేశ్ ఎంతో కొత్తగా కనిపిస్తున్నారు. అలాగే సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

 

 

సందీప్ కిషన్‌కు థ్యాంక్స్

వరుణ సందేశ్ మాట్లాడుతూ ‘నా సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేసినందుకు సందీప్ కిషన్‌కు థ్యాంక్స్. ఇలాంటి సర్ ప్రైజ్ ఇచ్చిన మా నిర్మాత భూమి గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ అక్టోబర్ వస్తే హ్యాపీ డేస్ విడుదలై పదిహేనేళ్లు అవుతుంది. అది మరో ఆనందం. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

డా. విక్రమ్ భూమి, దాసరి వెంకేటష్‌లు ఈ కథను పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాసుకున్నారు. ఇక ఈ చిత్రానికి శరత్ శ్రీకంఠం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే మిహిరమ్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. కళ్యాణ్ శ్యామ్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. షావోలిన్ మల్లేశ్ ఫైట్ మాస్టర్‌గా, ఆర్ఎం విశ్వనాథ్ కుంచనపల్లి ఎడిటర్‌గా, రాజు అడ్డాల ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొరియోగ్రాఫర్‌గా సురేష్ వర్మ పని చేస్తున్నారు.

Read More:  నారాయణ్‌ దాస్‌కు నివాళులర్పించడానికి వచ్చిన సందీప్‌ కిషన్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!