షూటింగ్ స్పాట్ లో ఫ్యాన్స్ తో సందీప్ కిష‌న్ (Sundeep Kishan) సెల్ఫీలు

Published on Apr 28, 2022 09:41 PM IST

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. దీనికి 'మైఖేల్'  అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. త‌మిళ‌ ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ ఇందులో విల‌న్ గా న‌టిస్తున్నాడు. కాగా, సందీప్ కిషన్ కు ఇది 29వ సినిమా కావ‌డం విశేషం. ఆ మ‌ధ్య ఈ సినిమా నుంచి ఓ పోస్ట‌ర్ వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ పోస్ట‌ర్ రెండు చేతులలో ఓ చేతికి సంకెళ్లు, ఓ చేతికి మారణాయుధం కలిగి ఉంది. ఆ పోస్ట‌ర్ ను చూస్తుంటే కంప్లీట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ అని తెలుస్తోంది. 

కాగా, ఈ ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. వ‌రుణ్ సందేశ్, అన‌సూయ వంటి న‌టులు కూడా ఈ సినిమాలో న‌టిస్తుండ‌టంతో ఈ చిత్రానికి భారీ హైప్ నెల‌కొంది. ఇదిలా ఉంటే.. హీరో సందీప్ కిష‌న్ ఈ మూవీ షూటింగ్ సెట్ కు వ‌చ్చిన‌ అభిమానుల‌ను క‌లిసి వారితో సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేశారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి.