సుమంత్ (Sumanth) న‌టిస్తున్న అహం - రీబూట్ సినిమా లేటెస్ట్ అప్ డేట్

Updated on Jun 14, 2022 08:59 PM IST
మేజ‌ర్ హీర్ అడ‌వి శేష్ సుమంత్ (Sumanth) సినిమా అహం -  రీబూట్ ఫ‌స్ట్ గ్లిట్స్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.  
మేజ‌ర్ హీర్ అడ‌వి శేష్ సుమంత్ (Sumanth) సినిమా అహం -  రీబూట్ ఫ‌స్ట్ గ్లిట్స్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.  

టాలీవుడ్‌లో సుమంత్ (Sumanth) ప్రేమకథ, గోల్కొండ హైస్కూల్, సత్యం లాంటి  గుర్తుండిపోయే సినిమాల్లో న‌టించారు. హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. చాలా గ్యాప్ త‌ర్వాత అహం - రీబూట్ సినిమాలో సుమంత్ న‌టిస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించాల‌ని సుమంత్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో అహం - రీబూట్ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాను వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

 

ఆర్జేగా సుమంత్
అహం - రీబూట్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఆ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇప్పుడు సుమంత్ న‌టించిన అహం - రీబూట్ నుంచి ఫస్ట్‌ గ్లిట్చ్‌ను విడుదల చేశారు.

ఓ అమ్మాయి కిడ్నాప్‌కు సంబంధించిన స‌స్పెన్స్ ఆ వీడియోలో ఉంది.  ఆ అమ్మాయిని ఆర్జే నిల‌య్ ఎలా ర‌క్షిస్తాడ‌నే క‌థ‌తో వీడియో సాగుతుంది. ఈ చిత్రానికి శ్రీరామ్‌ మద్దూరి సంగీతం అందిస్తున్నారు.  

అడివి శేష్ చేతుల మీదుగా వీడియో రిలీజ్

మేజ‌ర్ హీరో అడివి శేష్ ఈ సినిమా ఫ‌స్ట్ గ్లిట్చ్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు.  సుమంత్ (Sumanth)  ఆర్జే నిలయ్‌గా ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.  అహం రీబూట్ చిత్రం ప్రేక్ష‌కుల‌కు కొత్త క‌థ‌గా అనిపిస్తుంద‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్ అట్లూరి తెలిపారు.

అనుకోని సంఘ‌ట‌నలతో మ‌నిషిలోని కొత్త శ‌క్తులు బ‌య‌ట ప‌డ‌తాయ‌నే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలిపారు. ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని పేర్కొన్నారు. సుమంత్ (Sumanth)  న‌ట‌న ఈ సినిమాకే హైలెట్ అన్నారు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ సాగ‌ర్. 

Read More:  సుమంత్(Sumanth) కొత్త సినిమా : ‘అహం రీబూట్’ ఫ‌స్ట్ లుక్‌ విడుదల

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!