కొత్త సినిమా అనౌన్స్ చేసిన వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej).. ఆకట్టుకుంటున్న వీడియో

Updated on Jun 22, 2022 11:51 PM IST
పంజా వైష్ణవ్‌ తేజ్ సినిమా ముహూర్తం షాట్‌కు క్లాప్ కొడుతున్న సాయిధరమ్ తేజ్
పంజా వైష్ణవ్‌ తేజ్ సినిమా ముహూర్తం షాట్‌కు క్లాప్ కొడుతున్న సాయిధరమ్ తేజ్

‘ఉప్పెన’ సినిమాతో భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు మెగా వారసుడు వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej). ఆ సినిమా విజయం ఇచ్చిన కిక్‌తో 'కొండ పొలం' సినిమా చేశాడు. అయితే ఆ సినిమా కూడా ఆశించి స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేయలేకపోయింది. ఆ సినిమా తర్వాత ‘రంగరంగ వైభవంగా’ అంటూ మరో సినిమా సైన్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్‌లోనే బిజీగా ఉన్నాడు. 

ఇదే క్రమంలో, తాజాగా మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు ఈ మెగా వారసుడు.  సితార ఎంటర్‌‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. బుధవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, హీరో సాయి ధరమ్‌ తేజ్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

వైష్ణవ్‌ తేజ్‌ కొత్త సినిమా పోస్టర్

త్రివిక్రమ్ డైరెక్షన్..

ముహూర్తం షాట్‌కు త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా..  సాయి ధరమ్ తేజ్ క్లాప్‌ కొట్టాడు.ఈ సినిమా ముహూర్త కార్యక్రమం సందర్భంగా ఒక చిన్న వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్ చేసింది. 48 సెకండ్ల ఈ వీడియో ప్రకారం చూస్తే, ఈ చిత్రం పక్కా మాస్ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా అనే చెప్పుకోవచ్చు. పీవీటీ04 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు.

ఈ వీడియోలో ‘రేయ్ రాముడు లంక మీద పడ్డం ఇనుంటావ్. అదే పది తలకాయలోడు అయోధ్య మీద పడితే ఎట్టుంటదో సూస్తావా...’ అని విలన్‌ హెచ్చరిస్తుంటే.. ‘ఈ అయోధ్యలో ఉండేది రాముడు కాదప్పా.. ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు.. సూస్కుందాం రా.. తలలు కోసి సేతికిస్తా నాయాలా..’ అంటూ హీరో ఘాటుగా రిప్లై ఇస్తున్నాడు.

ఈ డైలాగ్స్‌కు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ మరింత పవర్‌‌ఫుల్‌ నెస్‌ను తెచ్చిపెట్టింది. 2023 సంక్రాంతి పండుగకు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియోలో తెలపడం గమనార్హం. 

Read More: Sai Dharam Tej : సాయితేజ్, సంపత్ నంది కాంబినేషన్‌లో.. ఓ భారీ యాక్షన్ సినిమాకు ప్లాన్ రెడీ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!