‘పుష్ప’ సిగ్నేచర్‌ వాక్‌ క్రెడిట్‌ ఎవరిదంటే..సీక్రెట్‌ చెప్పేసిన అల్లు అర్జున్‌ (Allu Arjun)

Updated on Jul 18, 2022 01:02 AM IST
పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun)
పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ (Allu Arjun)

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌ యాక్షన్ సినిమా ‘పుష్ప’. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌ ప్రేక్షకులను కూడా అలరించింది ఈ  సినిమా. అల్లు అర్జున్‌ మాస్‌ అప్పీల్‌, సుకుమార్‌ టేకింగ్‌, దేవి శ్రీ సంగీతం ఈ సినిమా రేంజ్‌ను మరింతగా పెంచేశాయి. ‘పుష్ప’ సినిమాలో క్యారెక్టర్‌‌ కోసం బన్నీ స్పెషల్‌గా ప్రిపేర్‌‌ అయ్యారు.

చిత్తూరు యాసతో పాటు, ఒక భుజంపైకెత్తి నడవటం కొత్తగా అనిపించాయి. ఇటీవల ఒక ఇంగ్లీష్ మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుష్ప సినిమాపై అల్లు అర్జున్‌ పలు కామెంట్లు చేశారు.   

‘పుష్ప సినిమాలో సిగ్నేచర్‌ వాక్‌  క్రెడిట్‌ మొత్తం దర్శకుడు సుకుమార్‌కే దక్కుతుంది. సినిమా మొదలు పెట్టే ముందు సుకుమార్‌ నా దగ్గరకు వచ్చి, ‘నువ్వు ఏం చేస్తావో తెలియదు. సినిమాలో నీ వాకింగ్‌ స్టైల్‌ ఒక ట్రెండ్‌ అయిపోవాలి. ప్రతి ఒక్కరూ దాన్నే ఫాలో కావాలి అని చెప్పారు. దీంతో భుజం పైకి ఎత్తి నడిచే స్టైల్‌ చూపించా. యువతలో ఇంత ట్రెండ్‌ అవుతుందనుకోలేదు.

అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్

గ్రేట్‌ ప్రాజెక్ట్‌..

ఇక, ‘పుష్ప’ ఒక గ్రేట్‌ ప్రోజెక్ట్‌. కిందిస్థాయి ప్రేక్షకులకు సినిమా బాగా నచ్చింది. దాంతో అందరికీ చేరువైందన్నారు బన్నీ. ప్రపంచవ్యాప్తంగా పుష్ప సినిమా రూ.350కోట్లకు పైగా వసూలు చేసింది. ఒక్క హిందీలోనే రూ.110 కోట్లు వచ్చాయి.

ప్రస్తుతం ‘పుష్ప2’ ప్రీ షూటింగ్‌ పనుల్లో బిజీగా ఉంది చిత్ర బృందం. అల్లు అర్జున్‌ (Allu Arjun)  హీరోగా ‘పుష్ప: ది రూల్‌’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌పై సుకుమార్‌ కూడా బిజీబిజీగా ఉన్నారు. త్వరలోనే పుష్ప2 సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. రెండో భాగంలో కీలక పాత్ర కోసం విజయ్‌ సేతుపతిని చిత్ర బృందం సంప్రదించిందని టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read More : ‘బ్రహ్మాస్త్ర’తో పోటీపడనున్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ‘నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని’ సినిమా

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!