దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నాకు మంచి ఫ్రెండ్.. పెళ్లి చేసుకోమని అడిగాడు : నిత్య మీనన్ (Nithya Menen)

Updated on Aug 21, 2022 05:30 PM IST
 దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తనకు ఒక మంచి స్నేహితుడని, పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని సూచిస్తుంటాడని నిత్యా తెలిపింది.  
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తనకు ఒక మంచి స్నేహితుడని, పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని సూచిస్తుంటాడని నిత్యా తెలిపింది.  

టాలీవుడ్ హీరోయిన్ మలయాళీ బ్యూటీ నిత్యామీనన్ (Nithya Menen) గురించి సినీ ప్రేక్షకులకు అందరికీ పరిచయమే. ఈ మధ్య ఈ అందాల ముద్దుగుమ్మ పేరు సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. 1998లో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలో బాలనటిగా అడుగు పెట్టింది నిత్యా మీనన్. ఆ తర్వాత 2010లో 'అలా మొదలైంది' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ అమ్మడు. ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తెలుగుతో పాటు తమిళ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. 

టాలీవుడ్‌లో నిత్యా మీనన్ కు 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'ఇష్క్' (Ishq), 'సన్నాఫ్ సత్యమూర్తి', 'జనతా గ్యారేజ్’ (Janata Garrage) వంటి సినిమాలు మంచి సక్సెస్‌ను ఇచ్చాయి. కొన్ని సినిమాలలో అతిథి పాత్రలలో సైతం నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే, తాజాగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది.

తన కాలికి గాయమవ్వడంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నానని.. పెళ్లి చేసుకోవడం కోసం కాదని హీరోయిన్ నిత్యామీనన్ (Nithya Menen) స్పష్టం చేసింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని నిత్యా మీనన్ తెలిపింది. ఇదే సమయంలో.. దుల్కర్ సల్మాన్ తనకు ఒక మంచి స్నేహితుడని, పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని సూచిస్తుంటాడని తెలిపింది.  

నిత్యా మీనన్ (Nithya Menen)

ఇక 'తన పెళ్లి గురించి ఇప్పుడే ఎలా చెప్ప‌గ‌ల‌నని.. భ‌విష్య‌త్తుని ముందే చెప్ప‌లేను క‌'దా అని.. అలాగ‌ని పెళ్లే చేసుకోన‌ని చెప్ప‌టం లేదని తన మనసులోని మాటని బయటపెట్టింది నిత్య (Nithya Menen). అయితే, తాను కూడా సినిమాల ఎంపిక గురించి ఎక్కువ‌గా ఆలోచించ‌నని తెలిపింది. కథ వినేట‌ప్పుడు ఎగ్జ‌యిట్ అయితే చాలని.. ఏమాత్రం ఆలోచించ‌కుండా సినిమాకు ఓకే చెప్పేస్తానని పేర్కొంది. 

నిత్యా మీనన్ (Nithya Menen) ఇంకా మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో సెలబ్రిటీల గురించి చాలా రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. మనం మంచి స్థాయిలో ఉన్నప్పుడు, మనల్ని కిందికి లాగాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. వాటన్నింటి గురించి పట్టించుకొని, నా టైమ్‌ని వేస్ట్ చేసుకోను. వాటిపై దృష్టి పెడితే నా పనులు చేసుకోవడానికి సమయం దొరకదు' అని తెలిపింది.

Read More: Nithya Menen: చేపల మార్కెట్‌లో దర్శనమిచ్చిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) బ్యూటీ నిత్యా మీనన్.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!