నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) – అనిల్ రావిపూడి ‘ఎన్‌బీకే108’ సినిమాలో తమిళ స్టార్ అరవింద్‌ స్వామి!

Updated on Sep 06, 2022 03:14 PM IST
అఖండ వంటి సూపర్‌‌హిట్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
అఖండ వంటి సూపర్‌‌హిట్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

‘అఖండ‌’ సినిమా సూపర్‌‌హిట్‌తో మంచి జోష్‌లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna). పోయినేడాది విడుద‌లైన ఈ సినిమా బాల‌య్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌ గ్రాస‌ర్‌గా నిలిచింది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య రెండు ద్విపాత్రాభినయం చేసి అభిమానులను ప్రేక్షకులను అలరించారు.

ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మ‌లినేని ద‌ర్శక‌త్వంలో అవుట్ అండ్ అవుట్ మాస్‌ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఎన్‌బీకే107 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ సినిమా ఏడాది చివ‌ర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ చిత్రం త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శక‌త్వంలో ఒక ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌ చేయనున్నారు బాలకృష్ణ. ఇప్పటికే ప్రీ ప్రొడ‌క్షన్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఎన్‌బీకే108 వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్త నెట్టింట వైర‌ల్‌ అవుతోంది.

అఖండ వంటి సూపర్‌‌హిట్‌ తర్వాత నందమూరి బాలకృష్ణ (Nandamuri BalaKrishna) గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.

కీలకపాత్ర కోసం..

ఈ చిత్రంలో కీల‌క పాత్ర కోసం తమిళ స్టార్ అర‌వింద్ స్వామిని చిత్ర యూనిట్‌ సంప్రదించిన‌ట్టు తెలుస్తోంది. దర్శకుడు చెప్పిన క‌థ న‌చ్చడంతో అర‌వింద్ స్వామి కూడా వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. త్వర‌లోనే దీనిపై అధికారిక ప్రక‌ట‌న రానుందని సమాచారం. ఇక అర‌వింద్ స్వామి ‘రోజా’, ‘బొంబాయి’ వంటి సినిమాల‌తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. రాంచరణ్‌ నటించిన ‘ధృవ’ సినిమాలో విలన్‌గా నటించిన అరవింద్‌ స్వామి మంచి మార్కులే వేయించుకున్నారు.  

తండ్రీ కూతురు సెంటిమెంట్‌తో అనిల్‌ రావిపూడి ఎన్‌బీకే108ను తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో బాలయ్యకు కూతురుగా పెళ్లిసందD సినిమాలో హీరోయిన్‌గా చేసి యూత్‌ను ఆకట్టుకున్న శ్రీలీల నటించనున్నారు. హీరోయిన్‌ అంజలి కీలకపాత్ర పోషిస్తున్న ఎన్‌బీకే108 సినిమాను షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ (Nandamuri BalaKrishna) లేటెస్ట్‌ హిట్‌ అఖండ వంటి సినిమాకు సూపర్‌‌హిట్‌ మ్యూజిక్‌ అందించిన ఎస్‌ఎస్‌ థమన్‌ ఈ సినిమాకు సంగీతం చేయనున్నారు.

Read More : టర్కీలో హోటల్‌లో బాలకృష్ణ (BalaKrishna).. సామాన్యుడితో సరదాగా ముచ్చటించిన బాలయ్య

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!