ధనుష్ (Dhanush) 'సార్' డిసెంబర్‌లో వచ్చేస్తున్నారు!.. అక్షరమే ధనుష్ ఆయుధమా!!
SIR Movie: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటిస్తున్న 'సార్' సినిమా విడుదల తేదీని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 2 తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మొదటిసారిగా ధనుష్ తెలుగులో నటిస్తున్న సినిమా 'సార్'. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. 'సార్' చిత్రాన్ని తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడిగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
లెక్చరర్ పాత్రలో ధనుష్
ధనుష్ బాలగంగాధర్ తిలక్ పాత్రలో కనిపించనున్నారు. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడి పాత్రలో నటించిన ధనుష్.. చదువును బిజినెస్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకుంటారు. లెక్చరర్‌గా ధనుష్ (Dhanush) ఇబ్బందులను ఎలా అధిగమిస్తాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది.
'సార్' సినిమాలో సాయికుమార్ విలన్‌గా కనిపించనున్నారట. సముద్రఖని, తనికెళ్ల భరణి, రాజేంద్రన్, హైపరి ఆది వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
'సార్' రిలీజ్ డిసెంబర్‌లో
'సార్' చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్ (Dhanush) నటించిన 'సార్' చిత్రం డిసెంబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ధనుష్ ఇటీవల నటించిన 'ది గ్రే మాన్', 'తిరు' సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచాయి. ధనుష్ నటిస్తున్న మరో సినిమా 'నేనే వస్తున్నా'. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుస సినిమాలతో దూసుకెళుతున్న ధనుష్ ఎలాంటి హిట్ అందుకోనున్నారో చూడాలి.
Read More : ధనుష్-ఐశ్వర్య మళ్లీ కలిసిపోయారా..? విడాకుల తొలిసారి ఒకే ఫ్రేములో కనిపించిన జంట ఫొటో వైరల్!