Thiruchitrambalam: ధ‌నుష్ (Dhanush) సినిమా 'తిరు' ట్రైలర్ రిలీజ్.. ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా కామెడీ పంచ‌నున్న‌ హీరో

Updated on Aug 13, 2022 07:05 PM IST
కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా 'తిరు' తెర‌కెక్కింది. ధ‌నుష్  (Dhanush) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా 'తిరు'లో క‌నిపించారు.
కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా 'తిరు' తెర‌కెక్కింది. ధ‌నుష్  (Dhanush) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా 'తిరు'లో క‌నిపించారు.

Thiruchitrambalam: సౌత్ స్టార్ హీరో ధ‌నుష్ (Dhanush) న‌టించిన తిరు సినిమా నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ద‌ర్శ‌కుడు మిత్ర‌న్ జ‌వ‌హ‌ర్ తెర‌కెక్కించన సినిమా తిరు ఆగ‌స్టు 18న రిలీజ్ కానుంది. స‌న్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై నిర్మాత‌ క‌ళానిధి మార‌న్ ఈ సినిమాను నిర్మించారు. 'తిరు' సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ సాధించాల‌నుకుంటున్నారు ధ‌నుష్. ఇటీవ‌లే ధ‌నుష్ న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ రిలీజ్ అయింది. 

కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా 'తిరు' తెర‌కెక్కింది. ధ‌నుష్  (Dhanush) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా 'తిరు'లో క‌నిపించారు.

తిరు ట్రైల‌ర్ అదుర్స్

కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమాగా 'తిరు' తెర‌కెక్కింది. ధ‌నుష్ (Dhanush) ఫుడ్ డెలివ‌రీ బాయ్‌గా 'తిరు'లో క‌నిపించారు. ప్రముఖ ద‌ర్శ‌కులు భార‌తీరాజా ధ‌నుష్‌కు తాత‌య్య పాత్ర‌లో న‌టించ‌గా.. ప్ర‌కాశ్ రాజ్ తండ్రి పాత్ర‌లో క‌నిపించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. రాశీఖ‌న్నా, ప్రియా భ‌వాని శంక‌ర్, నిత్యామీన‌న్ 'తిరు' సినిమాలో న‌టించారు. నిత్యామీన‌న్ పాత్ర హైలెట్‌గా నిల‌వ‌నుంది. బాధ‌తో ఇళ‌య‌రాజా పాట‌లు ధ‌నుష్ ఎందుకు వింటున్నారో తెలుసుకోవాంటే 'తిరు' చూడాల్సిందే.

 

హాలీవుడ్ రేంజ్‌కు ధ‌నుష్

'కాద‌ల్ కొండేన్' సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ధ‌నుష్  (Dhanush) జీవితం ఒక్క‌సారిగా మారిపోయింది. సౌత్‌లో టాప్ హీరోల‌లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ధ‌నుష్ త‌న న‌ట‌న‌తో త‌మిళ ప్రేక్ష‌కుల‌తో పాటు తెలుగు వారి ప్ర‌శంస‌లు అందుకున్నారు. ధ‌నుష్ న‌టించిన 'ది గ్రే మ్యాన్' సినిమా ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమాతో ధ‌నుష్ గ్లోబ‌ల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

Read More: The Gray Man: 'ట్రోల్ చేస్తున్నార‌ని బాధ ప‌డ‌కండి.. హాలీవుడ్ సినిమా చేసే అవ‌కాశం రావ‌చ్చు' - ధ‌నుష్ (Dhanush)

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!