ఆరేళ్లుగా వేధించిన వ్య‌క్తిని క్ష‌మించి వ‌దిలేశాను - నిత్యామీన‌న్ (Nithya Menen) 

Updated on Aug 07, 2022 12:27 PM IST
నిత్య‌మీన‌న్  (Nithya Menen) న‌టించిన మ‌ల‌యాళ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.
నిత్య‌మీన‌న్  (Nithya Menen) న‌టించిన మ‌ల‌యాళ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది.

టాలీవుడ్‌లో నిత్యామీనన్ (Nithya Menen) వ‌రుస ఆఫ‌ర్ల‌తో ముందుకు సాగుతున్నారు. సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌ల‌లోనూ న‌టిస్తూ నిత్యామీనన్ ప్రేక్ష‌కుల‌కు వినోదం అందిస్తున్నారు. అయితే ఈ మ‌ల‌యాళ బ్యూటీని ఆరేళ్ల నుంచి ఓ వ్యక్తి వేధిస్తున్నాడ‌ట‌. ఆ విష‌యాన్ని నిత్యామీన‌న్ స్వ‌యంగా చెప్పారు. నిత్యామీన‌న్ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. 

6 ఏళ్లగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా - నిత్యామీన‌న్
నిత్యామీన‌న్  (Nithya Menen) న‌టించిన మ‌ల‌యాళ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా గురించిన‌ విష‌యాల‌ను నిత్యామీన‌న్ ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. సినిమా విష‌యాల‌తో పాటు త‌న వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను వెల్ల‌డించారు. త‌న‌ను ఓ వ్య‌క్తి ఆరేళ్ల నుంచి వేధించాడ‌ని నిత్యామీన‌న్ తెలిపారు. కెరీయ‌ర్ ప‌రంగా.. వ్య‌క్తిగ‌తంగా ఎన్నో ఇబ్బందుల‌కు గురి చేశాడ‌న్నారు.ఆ వ్య‌క్తి త‌న గురించి చెప్పిన మాట‌లు న‌మ్మేవారు ఫూల్స్ అని నిత్యామీన‌న్ (Nithya Menen) అభిప్రాయ‌ప‌డ్డారు.

నిత్యాతో పాటు ఆమె త‌ల్లిదండ్రుల‌ను ఆ వ్య‌క్తి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టేవాడ‌ట‌. అత‌నికి సంబంధించిన 30 ఫోన్ నంబ‌ర్ల‌ను బ్లాక్ చేశాన‌న్నారు నిత్యామీన‌న్. త‌న స‌న్నిహితులు పోలీస్ కేసు పెట్ట‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ని.. కానీ అలా చేయ‌లేక‌పోయాన‌ని నిత్యా చెప్పుకొచ్చారు. ఆరేళ్ల‌గా త‌న‌ను ఇబ్బంది పెట్టిన వ్య‌క్తి సినిమా రివ్యూలు రాస్తార‌ని చెప్పారు.. కానీ అత‌ని పేరును మాత్రం నిత్యామీన‌న్ బ‌య‌ట పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. 

Read More: Nithya Menen: చేపల మార్కెట్‌లో దర్శనమిచ్చిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) బ్యూటీ నిత్యా మీనన్.. వీడియో వైరల్!

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!