Sumanth & Dulqar Salman: దుల్కర్ సల్మాన్ పై సుమంత్ ప్రశంసల వర్షం

Updated on Apr 20, 2022 04:50 PM IST
మాలీవుడ్‌ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘సీతారామం’ యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యపాత్రలో సుమంత్‌ నటిస్తున్నాడు
మాలీవుడ్‌ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘సీతారామం’ యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యపాత్రలో సుమంత్‌ నటిస్తున్నాడు

అక్కినేని నాగేశ్వరరావు మనుమడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్.. సత్యం సినిమాతో స్టార్ ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు. తర్వాత మాస్‌ ఇమేజ్ కోసం ప్రయత్నించినా పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఇక అప్పటినుంచి విభిన్నమైన కథలను సెలెక్ట్‌ చేసుకుంటూ మినిమం గ్యారెంటీ హీరో ఇమేజ్‌ సొంతం చేసుకున్నాడు.

ఇక, ఇప్పుడు మాలీవుడ్‌ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళ్‌ ఠాకూర్ జంటగా నటిస్తున్న ‘సీతారామం’ యుద్ధంతో రాసిన ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముఖ్యపాత్రలో సుమంత్‌ నటిస్తున్నాడు. రష్మికా మందాన కూడా కీలకపాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.

తన 22 సంవత్సరాల సినీ కెరీర్‌‌లో బెస్ట్‌ కో స్టార్ దుల్కర్ సల్మాన్‌ అని సుమంత్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సీతారామం మూవీ టీజర్‌‌ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్‌ వచ్చింది. స్వప్న సినిమాస్ బ్యానర్‌‌పై నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ ఎక్కువ శాతం జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని మంచు ప్రాంతాల్లో చేశారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!