Singer KK : చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు ఆయనకు పాటే ప్రాణం.. గాయ‌కుడు కృష్ణకుమార్ కున్నత్ జీవితం ఆదర్శప్రాయం !

Updated on Jun 01, 2022 03:04 PM IST
హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అంటూ ప్రేమ దేశం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు కేకే (Singer KK).  కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న కేకేకు హ‌ఠాత్తుగా గుండె పోటు వ‌చ్చింది. ప్రోగ్రాం నుంచి వెంట‌నే హోట‌ల్ రూంకు వెళ్లిన కేకే.. అక్క‌డే కుప్ప కూలారు.
హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అంటూ ప్రేమ దేశం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు కేకే (Singer KK). కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న కేకేకు హ‌ఠాత్తుగా గుండె పోటు వ‌చ్చింది. ప్రోగ్రాం నుంచి వెంట‌నే హోట‌ల్ రూంకు వెళ్లిన కేకే.. అక్క‌డే కుప్ప కూలారు.

బాలీవుడ్ సింగ‌ర్ కృష్ణకుమార్ కున్నత్ (Singer KK) గుండె పోటుతో మ‌ర‌ణించారు. ఎన్నో వేల పాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచిన కేకే గొంతు ఇక మూగ‌బోయింది. కోల్‌కతాలో ఓ స్టేజ్ షోలో పాల్గొన్న కేకేకు హ‌ఠాత్తుగా గుండె పోటు వ‌చ్చింది. ప్రోగ్రాం నుంచి వెంట‌నే హోట‌ల్ రూంకు వెళ్లిన కేకే.. అక్క‌డే కుప్ప కూలారు. 53 ఏళ్ల కృష్ణకుమార్ కున్నత్ చివ‌రి శ్వాస విడిచారు. హిందీతో పాటు 11 భాష‌ల్లో హిట్ సాంగ్స్‌ను పాడిన కేకే గొంతు ఇక మూగ‌బోయింది. 

హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అంటూ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన కేకే
హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే అంటూ ప్రేమ దేశం సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యారు కేకే (Singer KK).  కాలేజీ స్ట‌యిలే.. పాట‌తో కుర్ర‌కారును హుషారెత్తించారు.

మెరుపు క‌ల‌లు సినిమాలో స్ట్రాబెర్రీ పెన్నే సాంగ్‌తో కృష్ణకుమార్ కున్నత్ మ‌రింత పేరు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్నో హిట్ సాంగ్‌లు పాడి కేకే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. యే మేరా జహా (ఖుషీ), సున్‌సున్‌ సోనారే- పాటకి ప్రాణం(వాసు), దేవుడే దిగి వచ్చినా (సంతోషం), దాయి దాయి దామ్మా (ఇంద్ర), ఐ యామ్​ వెరీ సారీ (నువ్వే నువ్వే), నాలో నువ్వొక సగమై (జానీ), సీఎం పీఎం అవ్వాలన్నా( దిల్​), ఫీల్​ మై లవ్ ​(ఆర్య) పాట‌లు పాడారు. 

విషాద గీతాలు పాడ‌టంలో కేకేకు మించిన వారు లేరు!
కేకే సంగీతం అంటే పడిచచ్చిపోయే సంగీత అభిమానులు ఎందరో. ఎందుకంటే విషాద గీతాల‌తో ఆయ‌న చేసే మ్యాజిక్ అలాంటిది. ఎవ్వరినెప్పుడు తన వలలో..(మనసంతా నువ్వే), నీ కోసమే నా అన్వేషణ.(నువ్వు నేను), ప్రేమ ప్రేమ నీకు ఇది న్యాయమా..(జయం), ఊరుకో హృదయమా..(నీ స్నేహం) గుర్తుకొస్తున్నాయి..(నా ఆటోగ్రాఫ్​), తలచి తలచి (7జీ బృందావన్​ కాలనీ), ఆంధ్రుడు (ఓసారి ప్రేమించాక..), అనగనగనా ఒక..(ఔనన్నా.. కాదన్నా..), వెళ్తున్నా వెళ్తున్నా..(బాస్​) వంటి విర‌హ గీతాలు పాడ‌టంలో కేకేకు మించిన గాయ‌కులు లేరు.

ప్ర‌తీ విర‌హ గీతం కేకేను ఉన్న‌త స్థాయిలో నిల‌బెట్టింది. అందుకే తెలుగులో విర‌హా గీతాలు పాడాలంటే ముందు కేకేనే సంప్ర‌దించేవారు. కేకే (Singer KK) తెలుగులో చివ‌రిగా  నీ జతగా నేనుండాలి చిత్రంలో కనబడునా అనే పాట‌ను పాడారు. 

 కృష్ణకుమార్ కున్నత్ (Singer KK) బాలీవుడ్ సినిమాల్లో పాపుల‌ర్ అయింది మాత్రం ఏఆర్ రెహ‌మాన్ వ‌ల్లే.

ఏఆర్ రెహ‌మాన్‌తో కేకే బంధం
యాడ్స్ కోసం పాట‌లు పాడ‌టం ద్వారా కేకే పాపుల‌ర్ అయ్యారు. 11 భాష‌ల్లో 3,500 యాడ్స్​కు కేకే వాయిస్ ఇచ్చారు. లూయిస్​ బాంక్స్​, రంజిత్​ బారోత్​, లెస్లే లూయిస్​ వల్ల సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. యూటీవీ ప్రొగ్రామ్ సింగ్​ జింగిల్స్​తో  కృష్ణకుమార్ కున్నత్ (Singer KK) కు మంచి గుర్తింపు ద‌క్కింది. కానీ ఈయన బాలీవుడ్ సినిమాల్లో పాపుల‌ర్ అయింది మాత్రం ఏఆర్ రెహ‌మాన్ వ‌ల్లే. బాలీవుడ్‌లో కేకే దాదాపు టాప్ హీరోల చిత్రాల‌కు అన్నింటికీ పాట‌లు పాడారు. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యంగా మిగిలింది. 

కేకే (Singer KK) మ‌ర‌ణం భార‌త సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోటు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు కేకే మృతికి సంతాపం తెలిపారు. 

కృష్ణకుమార్ కుటుంబం
కృష్ణకుమార్​ కున్నాత్ (Singer KK)​ మీనన్​, కున్నాత్ కనకవల్లీల‌కు 1968 ఆగష్టు 23న జన్మించారు. కేకే కుటుంబం మ‌ళ‌యాలీ అయినా పుట్టింది పెరిగింది ఢిల్లీలోనే. డిగ్రీ త‌ర్వాత కొన్ని రోజులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్​గా జాబ్ చేశారు. ఆ త‌ర్వాత పాట‌ల‌పై ఇష్టంతో ముంబైకు వెళ్లారు. నార్త్‌లో స్కూల్​ ఫేర్​వెల్స్​లో వినిపించే పల్​, యారోన్ పాటలు కేకే రూపొందించిన పల్​ అనే ఆల్బమ్స్​లోనివే. కేకే 1991లో జ్యోతిని వివాహం చేసుకున్నారు. కొడుకు నకుల్ కృష్ణ కున్నాత్‌​ కూడా మంచి సింగర్​. కూతురు తమరా కున్నాత్‌.

చివ‌రి శ్వాస వ‌ర‌కు పాట‌తోనే కేకే
బాలీవుడ్​తో పాటు తమిళ్​, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ,  మలయాళంలోనూ  కృష్ణకుమార్​ కున్నాత్ (Singer KK) దాదాపు 800 పాటలు పాడారు. మూడు ద‌శాబ్దాల పాటు ఎన్నో మ‌ధుర‌మైన పాట‌ల‌తో ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హాయినిచ్చారు. గ‌తంలో కేకే స్టేజ్ షోలు త‌క్కువ‌గా చేసేవారు. ఈ మ‌ధ్య కాలంలో స్టేజ్ షోలు ఎక్కువ‌గా చేస్తున్నారు. చివ‌రి శ్వాస వ‌ర‌కు పాట‌తోనే కేకే గడిపారు. కేకే మ‌ర‌ణం భార‌త సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోటు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు కేకే మృతికి సంతాపం తెలిపారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!