చిరంజీవితో (Chiranjeevi) స్టెప్పులేయించనున్న ప్రభుదేవా

Updated on May 04, 2022 04:57 PM IST
 చిరంజీవి (Chiranjeevi), ప్రభుదేవా (Prabhudeva)
చిరంజీవి (Chiranjeevi), ప్రభుదేవా (Prabhudeva)

రంజాన్​ సందర్భంగా మెగా అభిమానులకు అదిరిపోయే సర్​ఫ్రైజ్​ ఇచ్చింది ‘గాడ్​​ ఫాదర్​’ చిత్రబృందం. చాలారోజుల గ్యాప్​  తర్వాత చిరంజీవితో (Chiranjeevi)  ప్రభుదేవా కొరియోగ్రాఫర్​గా  ఆటం బాంబులాంటి అదిరిపోయే  స్టెప్పులేయించబోతున్నట్టు  ప్రకటించింది. ఈ విషయాన్ని  చిత్రానికి సంగీతం అందిస్తున్న థమన్​ స్వయంగా తన సోషల్​మీడియా అకౌంట్ ద్వారా తెలియజేయడంతో మరింత సంబర పడుతున్నారు మెగా అభిమానులు. 

అంతేకాదు ఈ పాటలో చిరంజీవితోపాటు బాలీవుడ్​ స్టార్​ హీరో సల్మాన్​ ఖాన్​ కూడా కాలు కదపనున్నారట. చిరంజీవి, సల్మాన్​ ఖాన్​, ప్రభుదేవా కాంబినేషన్లో రూపొందే ఈ పాట థియేటర్లో అభిమానులకు పూనకాలు తెప్పిస్తుందని తెలుస్తోంది.

 

Chiranjeevi & Prabhudeva

మోహన్​ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్​ ఫాదర్​’  చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుందని తెలుస్తోంది. ఇందులో సల్మాన్‌ఖాన్‌ గెస్ట్ రోల్‌ చేస్తున్నారు. సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార మరో ముఖ్య పాత్రధారి. మలయాళంలో సూపర్‌హిట్‌అయిన `లూసీఫర్‌` చిత్రానికిది రీమేక్‌. అందులో పృథ్వీరాజ్‌ పాత్రని సల్మాన్‌చేస్తున్నారు. వివేక్‌ఒబేరాయ్‌ పాత్రని సత్యదేవ్‌ చేయబోతున్నట్టు టాక్‌.

చిరంజీవికి ఇందులో హీరోయిన్‌ లేదు. అందుకోసం ఓ ఐటెమ్‌ నెంబర్‌ని ప్లాన్‌ చేసినట్టు సమాచారం. చివరగా  `శంకర్‌దాదా జిందాబాద్‌` చిత్రంలో చిరంజీవితో స్టెప్పులేయించిన ప్రభుదేవా మళ్లీ ఈ చిత్రంలో పాటని కొరియోగ్రాఫ్​ చేస్తున్నారు. ప్రభుదేవా మార్క్​ స్టెప్పులు, చిరంజీవి స్టైల్​ కలిస్తే ఇక చెప్పేదేముంటుంది.

చిరంజీవి ఇటీవల నటించిన `ఆచార్య` చిత్రం డిజాస్టర్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 29 న విడుదలైంది. మొదటి షో నుంచే డివైడ్‌ టాక్‌తెచ్చుకుంది. దీన్నుంచి బయటపడేందుకు చిరంజీవి వెకేషన్‌ ప్లాన్‌చేశారు. తన భార్య సురేఖతో కలిసి చిరంజీవి అమెరికా, యూరప్‌ టూర్‌కి వెళ్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి వెల్లడించారు.

`కరోనా తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా` అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌చేశాడు చిరు. చిరంజీవి పోస్ట్​పై కూతురు శ్రీజతో పాటు కోడలు ఉపాసన స్పందించారు. `ఎంజాయ్‌మమ్మి అండ్‌డాడీ, ఐలవ్‌యూ సో మచ్‌` అని శ్రీజ అంటే, `హ్యాపీ టైమ్ అత్తయ్య‌, మామ‌య్య` అంటూ కోడలు ఉపాసన కామెంట్‌చేసింది.  ఇక చిరంజీవి (Chiranjeevi)  `గాడ్‌ఫాదర్‌`, `భోళా శంకర్‌`తో పాటు బాబీతో `మెగా154` చిత్రాల్లో నటిస్తున్నారు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!