68th National Film Awards: జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న - ఉత్త‌మ తెలుగు చిత్రంగా ఎంపికైన 'క‌ల‌ర్ ఫోటో' !

Updated on Jul 23, 2022 04:30 PM IST
68th National Film Awards:  ఉత్త‌మ చిత్రంగా తెలుగు సినిమా కలర్‌ ఫొటో జాతీయ అవార్డుకు ఎంపికైంది.
68th National Film Awards: ఉత్త‌మ చిత్రంగా తెలుగు సినిమా కలర్‌ ఫొటో జాతీయ అవార్డుకు ఎంపికైంది.

68th National Film Awards: 68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్స‌రానికి గానూ కేంద్ర ప్ర‌భుత్వం సినిమా రంగానికి చెందిన వివిధ కేట‌గిరీల‌కు అవార్డులు ప్ర‌క‌టించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాల‌కు జాతీయ అవార్డులు ల‌భించాయి. అందులో ఉత్త‌మ తెలుగు చిత్రంగా తెలుగు సినిమా (Telugu Film) ‘కలర్‌ ఫొటో‘ జాతీయ అవార్డుకు ఎంపికైంది. ‘క‌ల‌ర్ ఫోటో‘ సినిమాకు సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుహాస్, చాందిని చౌదరీలు హీరో హీరోయిన్లుగా ‘క‌ల‌ర్ ఫోటో‘లో న‌టించారు. 68వ జాతీయ సినిమా అవార్డుల కోసం 400 సినిమాలు పోటీప‌డ్డాయి.

68th National Film Awards:  ఉత్త‌మ చిత్రంగా తెలుగు సినిమా కలర్‌ ఫొటో జాతీయ అవార్డుకు ఎంపికైంది.

అల్లు అర్జున్ (Allu Arjun) న‌టించిన‌ 'అల వైకుంఠపురములో' చిత్రానికి గానూ ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడిగా త‌మ‌న్‌కు జాతీయ అవార్డు ల‌భించింది. తానాజీలో నటనకు అజయ్ దేవగన్‌తో పాటు, సూరరై పొట్రు (ఆకాశమే నీ హద్దురా) లో హీరోగా న‌టించిన సూర్య‌ ఉత్త‌మ న‌టుడుగా జాతీయ అవార్డులు అందుకున్నారు. 'సూర‌రై పొట్రు' చిత్రానికి ఏకంగా ఐదు జాతీయ అవార్డులు వ‌చ్చాయి. అలాగే మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌గా మధ్యప్రదేశ్‌కు అవార్డు ల‌భించింది.

  • ఉత్త‌మ న‌టుడు - సూర్య (సూరరై పొట్రు, తమిళ చిత్రం)  & అజయ్ దేవగన్ (తానాజీ, హిందీ చిత్రం)
  • ఉత్తమ నటి - అపర్ణ బాలమురళి (సురరై పొట్రు), తమిళ చిత్రం
  • ఉతమ సహాయనటుడు - బిజుమీనన్ (అయ్యప్పుమ్ కోషియం), మలయాళ చిత్రం
  • ఉత్తమ చిత్రం - సూరరై పొట్రు, తమిళ చిత్రం 
  • ఉత్తమ దర్శకుడు - కేఆర్ సచ్చిదానందన్ (అయ్యపుమ్ కోషియం), మలయాళ చిత్రం
  • ఉత్తమ సంగీత దర్శకుడు - తమన్‌ (అల వైకుంఠపురములో), తెలుగు చిత్రం
  • ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం - తానాజీ (హిందీ చిత్రం)
  • ఉత్తమ బాలల చిత్రం - సుమీ (మరాఠీ చిత్రం)
  • ఉత్తమ మొదటి చిత్ర దర్శకుడు - మండేలా (తమిళ చిత్రం)
  • ఉత్తమ  స్టంట్స్‌ మ్యాన్ - అయ్యప్పనుమ్‌ కోషియమ్‌
  • ఉత్తమ కొరియోగ్రఫీ - నాట్యం (తెలుగు చిత్రం)
  • ఉత్తమ డ్యాన్సర్‌: సంధ్య రాజు (నాట్యం, తెలుగు చిత్రం)
  • మోస్ట్‌ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్‌ - మధ్యప్రదేశ్‌

68th National Film Awards:  ఉత్త‌మ చిత్రంగా తెలుగు సినిమా కలర్‌ ఫొటో జాతీయ అవార్డుకు ఎంపికైంది.

నాన్‌ ఫీచర్ ఫిలిమ్స్

  • బెస్ట్‌ వాయిస్‌ ఓవర్‌: శోభా థరూర్ శ్రీనివాసన్, రాప్సోడీ ఆఫ్‌ రెయిన్స్‌ - మాన్‌సూన్స్‌ ఆఫ్‌ కేరళ (ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌: విశాల్‌ భరద్వాజ్‌  (1232 కి.మీ: మరేంగేతో వహీన్‌ జాకర్‌) (హిందీ)
  • బెస్ట్‌ ఎడిటింగ్‌: అనాదీ అతలే (బార్డర్‌ ల్యాండ్స్‌)
  • బెస్ట్‌ ఆన్‌లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌- సందీప్‌  భాటి, ప్రదీప్‌ లెహ్వార్‌ (జాదూయ్‌ జంగల్‌) (హిందీ)
  • బెస్ట్‌ ఆడియోగ్రఫీ(ఫైనల్‌ మిక్స్‌డ్‌ ట్రాక్‌): అజిత్‌ సింగ్‌ రాథోడ్‌ (పర్ల్‌ ఆఫ్‌ ద డిసర్ట్‌ ) (రాజస్థానీ)
  • బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: నిఖిల్‌ ఎస్‌ ప్రవీణ్‌ (శబ్దికున్‌ కలప్ప) (మలయాళం)
  • ఉత్తమ డైరెక్షన్‌: ఆర్‌వీ రమణి (ఓ దట్స్‌ భాను- ఇంగ్లీష్‌, తమిళ్‌, మలయాళం, హిందీ)
  • ఉత్తమ కుటుంబ కథా చిత్రం: కుంకుమార్చన్‌ (మరాఠి)
  • ఉత్తమ షార్ట్‌ ఫిక్షన్‌ ఫిలిం: కచీచినుతు (అస్సాం)
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డ్‌: అడ్మిటెడ్‌ (హిందీ, ఇంగ్లీష్‌)
  • బెస్ట్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఫిలిం: ద సేవియర్‌: బ్రిగేడియర్‌ ప్రీతమ్‌ సింగ్‌ (పంజాబీ)
  • బెస్ట్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ ఫిలిం: వీలింగ్‌ ద బాల్‌ (ఇంగ్లీష్‌, హిందీ)
  • బెస్ట్‌ ఎడ్యుకేషనల్‌ ఫిలిం: డ్రీమింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ (మలయాళం )
  • బెస్ట్‌ ఫిలిం ఆన్‌ సోషల్‌ ఇష్యూస్‌: జస్టిస్‌ డిలేయ్‌డ్‌ బట్‌ డెలివర్‌డ్‌ (హిందీ), 3 సిస్టర్స్‌ (బెంగాలీ)
  • బెస్ట్‌ ఎన్వైర్‌మెంట్‌ ఫిలిం: మాన అరు మానుహ్‌ (అస్సామీస్‌)
  • బెస్ట్‌ ప్రొమోషనల్‌ ఫిలిం: సర్‌మొంటింగ్‌ చాలెంజెస్‌ (ఇంగ్లీష్‌)

Read More: అమెరికాలో 'ఇండియన్ ఇండిపెండెన్స్ డే వేడుకల'కు అల్లు అర్జున్‌ (Allu Arjun) నాయ‌క‌త్వం !

 

68th National Film Awards:  ఉత్త‌మ చిత్రంగా తెలుగు సినిమా కలర్‌ ఫొటో జాతీయ అవార్డుకు ఎంపికైంది.

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!