మణిరత్నం (Maniratnam) 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న షాలినీ?

Updated on Jun 15, 2022 05:07 PM IST
మణిరత్నం (Maniratnam) తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ సినిమా పోస్టర్, షాలినీ
మణిరత్నం (Maniratnam) తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ సినిమా పోస్టర్, షాలినీ

ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Maniratnam) చోళుల కాలానికి సంబంధించిన కథ ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. చారిత్రక కథాంశంతో భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. 

లైకా ప్రొడక్షన్స్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా మల్టీస్టారర్‌‌గా అలరించనుంది. రెండు భాగాలుగా విడుదల చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ పూర్తయినట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

ముఖ్యపాత్రలో ఐశ్వర్యారాయ్

'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ప్రభు, ప్రకాష్‌రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

మణిరత్నం (Maniratnam) తెరకెక్కిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ సినిమా పోస్టర్

రీఎంట్రీపై ఇంకా రాని క్లారిటీ

ఇంత భారీ స్థాయిలో, భారీ తారాగణంతో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో స్టార్ హీరో అజిత్ భార్య షాలినీ అతిథి పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన షాలినీ, మణిరత్నం దర్శకత్వం వహించిన 'సఖి' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

అజిత్‌తో పెండ్లి తరువాత షాలినీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు షాలినీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఇందులో ఎంత మాత్రం నిజం లేదని అజిత్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. దీనిపై మణిరత్నం గానీ, అజిత్ – షాలినీ గానీ స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 

భారీ బడ్జెట్.. స్టార్ యాక్టర్లు..

ఇక, ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను తెరకెక్కించాలనేది చిత్రనిర్మాతల దశాబ్దాల కల. 1995లో కల్కి కృష్ణమూర్తి రాసిన రాజరాజ చోళుని కథ ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. దక్షిణాదిని అజేయంగా పాలించిన రాజరాజ చోళుడి కథ నవలా ఇతివృత్తం. ఈ ప్రసిద్ధ నవల ఆధారంగా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాను మణిరత్నం తెరకెక్కిస్తున్నారు.

ఏఆర్ రెహమాన్ సంగీతం..

కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో, స్టార్ యాక్టర్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి.. యాక్షన్ సీక్వెన్స్‌లను షామ్ కౌశల్ తెరకెక్కిస్తున్నాడు.

షూటింగ్ పూర్తయ్యిందని..

దేశంలోని చాలా ప్రాంతాల్లో షూటింగ్ జరిగిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా చివరి షెడ్యూల్‌ మధ్యప్రదేశ్, హైదరాబాద్‌లో జరిగింది. పొలాచ్చిలో క్లైమాక్స్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా మొదటి భాగం షూటింగ్‌ను పూర్తి చేసినట్టు మేకర్స్ తెలిపారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌ ఒక పోస్టర్‌‌ను కూడా విడుదల చేసింది.

విక్రమ్‌, కార్తీ, జయం రవి క్యారెక్టర్లకు సంబంధించిన రెండు భాగాల షూటింగ్‌ పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఫస్ట్‌ పార్ట్‌ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More: క్లాసికల్ సినిమాలకు కేరాఫ్‌.. మణిరత్నం (Mani Ratnam).. డైరెక్టర్లలో ఆయనొక దళపతి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!