Actress Tabu: అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న 'భోలా' (Bholaa) సినిమా షూటింగ్ లో గాయపడ్డ అలనాటి హీరోయిన్ టబు..!
టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఎన్నో సినిమాలు చేసి.. స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది టబు (Actress Tabu). అప్పట్లో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఆ తరువాత క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ.. సీనియర్ నటిగా మారింది. తెలుగుతో పాటు హిందీ సినిమాల్నూలో కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తోంది ఈ సీనియర్ బ్యూటీ.
టబు ప్రస్తుతం బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ (Ajay Devgn) ప్రధాన పాత్రలో వస్తున్న 'భోలా' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ పోలీస్ అధికారిణి. తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను ముంబయిలో చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా ట్రక్ ఛేజింగ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ట్రక్ అద్దాలు పగిలి టబుకు గుచ్చుకున్నాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
ట్రక్కు అద్దాలు పగిలిపోవడంతో టబు (Actress Tabu) నుదుటిపైనా, కంటికి దగ్గరగా గాయాలయ్యాయి. అయితే కంటికి ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో యూనిట్ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడిన టబును యూనిట్ సభ్యులు ఆసుపత్రికి తరలించారు.
'భోలా' (Bholaa Movie) సినిమా షూటింగ్ సమయంలో టబు ఒక దట్టమైన అడవిలో ట్రక్కును నడుపుతోంది. అదే సమయంలో మోటార్‌సైకిల్‌పై కొందరు దుండగులు ఆ ట్రక్కును వెంబడిస్తూ ఉంటారు.
సినిమా షూటింగ్‌లో భాగంగానే ఇది జరుగుతూ ఉండగానే ఆ ట్రక్కును వెంబడిస్తున్న బైక్‌లలో ఒకటి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. అలా ఢీ కొన్న సమయంలో ఒక గాజు ముక్క విరిగి టబును (Tabu Injured) తాకింది. అయితే ఆమె తనంతట తానుగా కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవడానికి అజయ్ ఒక ఆమెకు బ్రేక్ ఇచ్చారని తెలుస్తోంది.