Alia Bhatt: బాలీవుడ్ (Bollywood) సినిమాల పట్ల మీడియా సానుభూతితో వ్యవహరించాలి : అలియా భట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ (Alia Bhatt) పెళ్లి ఈ మధ్యే రణ్ బీర్ కపూర్ ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ బ్యూటీ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది. మరోవైపు ఇప్పటికే కమిట్ అయిన సినిమాలకు ప్రెగ్నెన్సీలోనూ ప్రమోషన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్చానికి గురి చేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ నటించిన మూవీ 'డార్లింగ్స్' (Darlings Movie) నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. అయితే.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నా అలియా భట్.. దక్షిణాది చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అలియా భట్ (Alia Bhatt) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "కంటెంట్ ఉంటేనే ఏ సినిమా అయినా ఆడుతుంది. అయినా, ఈ మధ్య కాలంలో బీ టౌన్ సినిమాలను ప్రేక్షకులు బొత్తిగా పట్టించుకోవడం మానేశారు.. అటు మంచి సినిమాల్ని కూడా ఫ్లాప్ చేశారు. దక్షిణాది సినిమాల్లోనూ అన్ని సినిమాలూ విజయం సాధించడం లేదు.. కంటెంట్ రిచ్ మూవీస్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయ్ కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు ధియేటర్లకు వస్తారు.. అని చెబుతూనే బాలీవుడ్ మీద కాస్త దయ చూపించాలి" అని పేర్కొంది.
అదే విధంగా బాలీవుడ్ (Bollywood) సినిమాల పట్ల మీడియా సానుభూతితో వ్యవహరించాలని, వాటిని చెత్తబుట్టలో వేయవద్దని కోరింది. ఇది కేవలం ఒక దశ మాత్రమే. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలు వచ్చి ఒక్కసారి ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తే..మళ్లీ అన్నీ సర్దుకుంటాయని చెప్పుకొచ్చింది. కోవిడ్ వలన ఏర్పడిన నష్టాల నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా బయటపడుతుందని.. ప్రస్తుతం సినీ పరిశ్రమకు ఇది కష్టమైన సమయమని అన్నారు అలియా భట్.
ప్రెగ్నెన్సీ ప్రొఫిషనల్ లైప్‌కి అడ్డంకి అవ్వడం లేదా.? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడు వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సిన అవసరమే లేదు.. అని చెప్పింది. దీంతో నెటిజన్లు.. ఆహా.! వృత్తి పట్ల అలియాకి ఎంత డెడికేషన్ అంటూ తెగ ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అలియాభట్ ప్రస్తుతం రణ్ బీర్ కపూర్‌తో 'బ్రహ్మాస్త్ర' (Brahmastra) సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read More: Alia Bhatt: ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక షూటింగ్ లో పాల్గొన్న అలియా భట్.. బేబీ బంప్ ఫొటోలు వైరల్!