అజ‌య్ దేవ‌గ‌ణ్(Ajay Devgn) ఆర్.ఆర్.ఆర్ సినిమా చూడ‌లేదా?

Updated on May 01, 2022 06:09 PM IST
Ajay Devgn: ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కీల‌క రోల్‌లో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించారు. ఆర్.ఆర్.ఆర్ వేయి కోట్లు రాబ‌ట్టింది. కానీ అజ‌య్ దేవ‌గ‌ణ్ మాత్రం ఆ సినిమా ఇంకా చూడ‌లేద‌ట‌...

రౌద్రం ర‌ణం రుధిరం సినిమాను ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇండియ‌న్ సినిమాల్లో టాప్ ప్లేస్‌లో నిల‌బెట్టారు. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఇద్ద‌రు టాప్ హీరోల‌తో అదిరిపోయే సినిమా చేశారు. వేయి కోట్ల రూపాయ‌ల క్ల‌బ్‌లో ఆర్.ఆర్.ఆర్. చేరింది. 

బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా ఆర్.ఆర్.ఆర్‌లో ఇంపార్టెంట్ రోల్‌లో న‌టించారు. రామ్ చ‌ర‌ణ్‌కు తండ్రిగా... దేశాన్ని కాపాడే యోధుడు పాత్ర‌లో అజ‌య్ దేవ‌గ‌ణ్ న‌టించారు. ప‌వ‌ర్ ఫుల్ రోల్‌లో న‌టించిన అజ‌య్ దేవ‌గ‌ణ్ ఇంకా ఆర్‌.ఆర్.ఆర్ సినిమా చూడ‌లేద‌ట‌.

ఆర్.ఆర్.ఆర్, గంగూబాయ్ సినిమాలు ఇంకా చూడ‌లేద‌ని ఓ ఇంటర్వ్యూలో అజయ్ దేవగణ్ (Ajay Devgn) అన్నారు. త‌న భార్య కాజ‌ల్ న‌టించిన దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా కూడా ఇంకా చూడ‌లేద‌ట‌. అజ‌య్ దేవ‌గ‌ణ్ సినిమాల‌ను ఎక్కువ‌గా చూడ‌ర‌ట‌. తాను న‌టించిన సినిమా అయితే వెంట‌నే చూస్తాన‌ని.. లేదంటూ అస‌లు చూడ‌డ‌ని చెప్పారు. చాలా ఆల‌స్యంగా సినిమా చూస్తే ఇంకా బాగా చేయాల్సింద‌నే ఫీలింగ్ క‌లుగుతుంని చెప్పారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!