స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata)కు అన్ని సెట్లా!

Updated on Apr 29, 2022 02:54 PM IST
ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా చేస్తున్న కొత్త ప్రాజెక్టు స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata). రీసెంట్‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఆ సినిమాకి వేసిన సెట్స్ హైలెట్‌గా ఉన్నాయ‌ట‌.
ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా చేస్తున్న కొత్త ప్రాజెక్టు స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata). రీసెంట్‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఆ సినిమాకి వేసిన సెట్స్ హైలెట్‌గా ఉన్నాయ‌ట‌.

ప్రిన్స్ మ‌హేష్ బాబు హీరోగా చేస్తున్న కొత్త ప్రాజెక్టు స‌ర్కారు వారి పాట‌(Sarkaru Vaari Paata). రీసెంట్‌గా స‌ర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తి అయింది. ఆ సినిమాకి వేసిన సెట్స్ హైలెట్‌గా ఉన్నాయ‌ట‌. ప్రిన్స్ కొత్త సినిమా ఇంట్ర‌స్టింగ్ అప్‌డేట్ ఏంటంటే.. 

స‌ర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమాలో మ‌హేష్ బాబు, కీర్తి సురేష్‌లు హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బ్యాంక్ దోపిడీకి సంబంధించిన క‌థ‌తో ఈ సినిమా తీస్తున్నారు. ప‌రుశురామ్ స‌ర్కారు వారి పాట సినిమాకు డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రిన్స్  కొత్త సినిమా కోసం ఎనిమిది భారీ సెట్ల‌ను రూపొందించార‌ట‌. ఆ విష‌యాన్ని ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్  చెప్పారు. సర్కారు వారి పాట లేటెస్ట్  వివ‌రాలతో మ‌హేష్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. 

స‌ర్కారు వారి పాట సినిమా బ్యాంక్ బాగ్రౌండ్‌లో తీశారు. మూడు బ్యాంకులను డిజైన్ చేసి వాటి సెట్ల‌ను ఏర్పాటు చేశార‌ట ఆర్ట్ డైరెక్ట‌ర్. ఒక‌టి యాభై ఏళ్ల క్రితం బ్యాంక్  ఎలా ఉంటుందో అలానే సెట్ వేశారట‌. అన్న‌పూర్ణ స్టూడియోలో ఓల్డ్ బ్యాంక్ సెట్ వేశారు. ప్లాష్ బ్యాక్ సీన్లు ఈ బ్యాంక్ సెట్‌లో తీశారు. మ‌రో సెట్ మోడ‌ర‌న్ బ్యాంక్. 

బ్యాంకుకు సంబంధించిన సెట్టు కాకుండా స‌ర్కారు వారి పాట సినిమాకు ఎనిమిది సెట్లు వేశారు. ఓ వీధి రూపుతో సెట్ వేశార‌ట‌. గోవాలో షూటింగ్ చేద్దామ‌నుకుంటే.. కొన్ని కార‌ణాల‌తో హైద‌రాబాద్‌కి మార్చామ‌న్నారు. వైజాగ్ ఏరియాకి త‌గిన‌ట్టుగా ఓ కాల‌నీని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. రియ‌ల్ లుక్ ఉండేలా సెట్స్  డిజైన్ చేశామ‌ని ఆర్ట్ డైరెక్ట‌ర్ పరుశురామ్ చెప్పారు.  ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ కూడా బాగుండేలా ఏర్పాటు చేశామ‌న్నారు. 

స‌ర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించారు. అనంత శ్రీరామ్ రాసిన క‌ళావ‌తి పాట యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. వ‌రుస హిట్‌ల‌తో దూకుడు మీదున్న మ‌హేష్ ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!