కర్ణాటక ప్రభుత్వంపై ‘కాంతార’ (Kantara) ఎఫెక్ట్.. 60ఏళ్లు దాటిన 'దైవ నర్తకుల'కు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయం!
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా కన్నడ సినిమా 'కాంతార' (Kantara) గురించే వార్తలు వినిపిస్తున్నాయి. రిషబ్ శెట్టి (Rishabh Shetty) హీరోగా, సప్తమి గౌడ (Sapthami Gowda) హీరో హీరోయిన్ గా నటించారు. రిషబ్ శెట్టి సొంత దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 'కేజీఎఫ్' (KGF) సినిమాని తెరకెక్కించిన హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ 'కాంతార' (Kantara) చిత్రం.. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంటోంది. ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి ఫుల్ మార్కులు సొంతం చేసుకున్నారు. హిందీలో ఈ సినిమాని రిలీజ్ చేయగా ఇక్కడ కూడా భారీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
ఈ సినిమాలో కర్ణాటకలోని (Karnataka) ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని, ముఖ్యంగా భూతకోల నృత్యకారులను అద్భుతంగా చూపించారు. వారి కష్టాలని, వారి ట్యాలెంట్ ని సినిమాలో చూపించారు. దీనిని కన్నడ ప్రజలు అభినందిస్తున్నారు. సినిమాకు అంతకంతకూ రీచ్ పెరుగుతుండడంతో పాటు ఈ భూతకోల నృత్యకారులకు కూడా పేరు వస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా 'కాంతార' (Kantara) సినిమాకు సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాపై కర్ణాటక ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రామీణ సంప్రదాయ దైవారాధనలు, ఉత్సవాలు, ఊరేగింపుల్లో నృత్యాలు చేసే దైవ నర్తకులకు ప్రతి నెలా రూ.2వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు రాష్ట్ర మంత్రి సునీల్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఈ మధ్య రిలీజైన ‘కాంతార’ (Kantara) సినిమా స్ఫూర్తితోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? అన్న విలేకరులు ప్రశ్నకు... తీసుకుంటే తప్పేంటని ఆయన బదులిచ్చారు. అయితే, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో 60 ఏళ్లు దాటిన నృత్యకారులకు ఆర్థిక సాయం అందనుంది.
Read More: నా శరీరం ఇంకా వణుకుతోంది.. సినిమా అంటే ‘కాంతార’ (Kantara)లా ఉండాలి: కంగనా రనౌత్ (Kangana Ranaut)