పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రొమాంటిక్ హీరోయిన్ కేతిక శర్మ!

Updated on Jun 14, 2022 12:14 PM IST
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), కేతిక శర్మ
పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), కేతిక శర్మ

పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ ఏడాది భీమ్లానాయక్ సినిమాలో సూపర్ డూపర్ హిట్ అందుకున్న పవన్.. ప్రస్తుతం ఆ సినిమా విజయం ఇచ్చిన జోష్‌తో మరింత స్పీడ్‌గా తర్వాత సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేస్తున్నాడు. ‘హరిహర వీరమల్లు’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కల్యాణ్‌ తర్వాత సినిమా షూటింగ్‌కు కూడా డేట్స్‌ ఇచ్చాడని తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ సెట్స్‌పై ఉండగానే తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సిత్తం’ సినిమా షూటింగ్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌ను తెరకెక్కించిన సముద్రఖని తెలుగు వెర్షన్‌ను కూడా తెరకెక్కించనున్నాడు. ఈ రీమేక్‌లో సాయిధరమ్‌ తేజ్‌ కీలకపాత్రలో నటించనున్నాడు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా పలువురి పేర్లను అనుకున్నా 'రొమాంటిక్' సినిమాలో హీరోయిన్‌గా చేసిన కేతిక శర్మను ఎంపిక చేశారని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్​ కొడుకు ఆకాష్‌ హీరోగా నటించిన 'రొమాంటిక్‌' తోపాటు 'లక్ష్య' సినిమాలో నటించిన కేతిక.. తన అందంతో కుర్రకారు గుండెల్లో చోటు దక్కించుకుంది. అయితే ఈ సినిమాలో కేతిక శర్మను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. జూలై నెలలో ఈ సినిమా షూటింగ్ స్టార్‌‌ కానుందని సమాచారం.

ఈ సినిమా షూటింగ్‌ కోసం పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఇరవై రోజులు కాల్‌షీట్స్‌ కూడా ఇచ్చాడని టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌‌పై టీజీ శివప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Read More: మేజ‌ర్ (Major) టీమ్‌కు మన‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలిపిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!