బుల్లితెరపై మరో సరికొత్త రియాలిటీ షో 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' (Mr and Mrs).. యాంకర్ గా హాట్ బ్యూటీ శ్రీముఖి!

Updated on Oct 13, 2022 01:02 PM IST
పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి (Anchor Sreemukhi) యాంకర్ గా వ్యవహరించనుండటం విశేషం.
పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి (Anchor Sreemukhi) యాంకర్ గా వ్యవహరించనుండటం విశేషం.

Mr and Mrs Game Show: తెలుగు బుల్లితెరపై కొత్త కొత్త ఎంటర్టైన్మెంట్ షోలు వస్తూనే ఉన్నాయి. ఛానెళ్ల మధ్య పోటీ పెరుగుతూనే ఉంది. నిర్మాణ సంస్థలు కొత్త కొత్త షోలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి (Anchor Sreemukhi) యాంకర్ గా సరికొత్త రియాలిటీ షో రాబోతోంది. 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' (Mr and Mrs) అనే టైటిల్ తో 'ఒకరికి ఒకరు' సబ్ టైటిల్ తో ఈ షో రానుంది.

తెలుగు టీవి రంగంలో గత పదేళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నుంచి ఈ షో రాబోతోంది. ‘అలీతో సరదాగా’, ‘వావ్‌’, ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ లాంటి సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేసిన అనిల్‌ కడియాల.. ప్రస్తుతం ఈ షోని తెరపైకి తీసుకువస్తున్నారు. 

పది ఫేమస్‌ జంటలతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ షోకి శ్రీముఖి (Anchor Sreemukhi) యాంకర్ గా వ్యవహరించనుండటం విశేషం. కంటెంట్‌ను ఎంతో క్రియేటివ్‌గా డిజైన్‌ చేసిన నిర్మాత ప్రవీణా కడియాల మాట్లాడుతూ.. ‘‘ఈటీవీలో అక్టోబర్‌ 11న ప్రారంభం అవుతుంది మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ (ఒకరికి ఒకరు). ప్రతి మంగళవారం రాత్రి 9:30నిమిషాలకు ప్రసారం కానున్న ఈ షోద్వారా ప్రముఖ నటి స్నేహ (Actress Sneha) తొలిసారి జడ్జిగా వ్యవహరిస్తుండటం విశేషం.

స్నేహతో పాటు నటుడు శివబాలాజి (Actor Shiva Balaji) ఒక జడ్జిగా వ్యవహరిస్తుండగా బ్లాక్‌బస్టర్‌ చిత్రాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచి ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ స్లోగన్‌ను తెలుగువారికి పరిచయం చేసిన దర్శకుడు అనిల్‌ రావిపూడి (Director Anil Ravipudi) స్పెషల్‌ జడ్డిగా వ్యవహరించటం ఈ షోకే హైలెట్‌. ఈ షోలో పాల్గొంటున్న పది జంటలకు రకారకాల టాస్క్‌లు ఉంటాయి. ఆ టాస్క్‌ల్లో విజేతగా నిలిచిన వారు ఫైనల్‌కి వెళ్లి గ్రాండ్‌ ఫినాలే టైటిల్‌తో పాటు భారీ ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంటారు అని చెప్పుకొచ్చారు నిర్మాతలు.

'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' షో కు నిర్మాతగా వ్యవహరించే ప్రవీణా కడియాల, దర్శకులిద్దరూ భార్య, భర్తలు కావటంతో ఎంత పెద్ద షోనైనా సక్సెస్‌ బాట పట్టించటం వీరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.  

'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌' పోటీలో పాల్గొంటున్న పదిజంటలివే.. 

1. రవికిరణ్‌–సుష్మా 
2. పవన్‌–అంజలి 
3. సందీప్‌–జ్యోతి 
4. హ్రితేష్‌–ప్రియా 
5. శ్రీవాణి–విక్రమ్‌ 
6. మధు–ప్రియాంక 
7. ప్రీతమ్‌–మానస 
8. సిద్దు–విష్ణుప్రియ 
9. రాకేశ్‌–సుజాత 
10. విశ్వ–శ్రద్ధ. 

కాగా, ఈ జంటలందరూ బుల్లితెర ప్రేక్షకులందరికీ సుపరిచితులే.. అనేక సందర్భాల్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నవారే కావడం గమనార్హం. 

Read More: Anchor Sreemukhi: దుబాయిలో వాలిపోయిన యాంకర్ శ్రీముఖి.. బుర్జ్ ఖలీఫా వద్ద హాట్ హాట్ పోజులు!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!