Shamshera: షంషేరా ల‌వ్ సాంగ్ రిలీజ్! - 'నీ పైన పిచ్చి ప్రేమే క‌దా' అంటున్న వాణి క‌పూర్

Updated on Jul 09, 2022 06:52 PM IST
Shamshera: షంషేరా నుంచి 'నీ పైన పిచ్చి ప్రేమే క‌దా' అనే పాట‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
Shamshera: షంషేరా నుంచి 'నీ పైన పిచ్చి ప్రేమే క‌దా' అనే పాట‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Shamshera: బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) త‌న సినిమాల‌ను ఇక‌పై తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. షంషేరా, బ్ర‌హ్మాస్త్రం సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు. షంషేరా సినిమాకు సంబంధించిన ప్రేమ పాట‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ర‌ణ‌బీర్ క‌పూర్, వాణి క‌పూర్ మ‌ధ్య ఈ ల‌వ్ సాంగ్ సాగింది.. ఈ పాట యూట్యూబ్‌లో దూసుకెళుతుంది. 

షంషేరా నుంచి 'నీ పైన పిచ్చి ప్రేమే క‌దా' అనే పాట‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు మిథూన్ సంగీతం స‌మ‌కూర్చారు. ల‌వ్ సాంగ్‌ను యాజిన్, నీతి మోహ‌న్ ఆల‌పించారు. సంగీత ద‌ర్శ‌కురాలు శ్రీలేఖ‌ తెలుగు పాట‌ల‌కు రికార్డుల‌ను ప‌ర్య‌వేక్షించారు.

 షంషేరా సినిమాకు క‌ర‌ణ్ మ‌ల్హోత్రా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌శ్ రాజ్ ఫిలిమ్స్ షంషేరా చిత్రాన్ని నిర్మిస్తోంది. య‌శ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న 50 వ చిత్రం షంషేరా.
 

పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్

ర‌ణ్‌బీర్ క‌పూర్ (Ranbir Kapoor) న‌టిస్తున్న 'షంషేరా'కు సంబంధించి ఇటీవ‌లే తెలుగు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. 'క‌ర్మ వ‌ల్ల దొంగ‌లం.. ధ‌ర్మంగా స్వ‌తంత్రులం' అనే డైలాగులతో కూడిన ఆ పోస్టర్, చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక ర‌ణ్‌బీర్ చేతిలో గొడ్డ‌లి .. ఎలాంటి ర‌క్త పాతం సృష్టిస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా నుంచి టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. 'షంషేరా' చిత్ర ట్రైల‌ర్‌ను జూన్ 24 న రిలీజ్ చేశారు.

ఓ కరడుగట్టిన పోరాట యోధుడిగా ర‌ణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నారు. త‌న వ‌ర్గాన్ని కాపాడుకునేందుకు హీరో ఏం చేయ‌నున్నార‌నే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.

ఇక ఈ చిత్రంలో కూడా ప్రతి నాయకులకు పెద్ద పీటే వేశారు దర్శకుడు. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' సినిమాలో సంజ‌య్ ద‌త్ విల‌న్‌గా అద్భుత‌మైన న‌ట‌నను ప్ర‌ద‌ర్శించారు. ఇక 'షంషేరా'లో కూడా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు సంజ‌య్ ద‌త్.

ర‌ణ్‌బీర్ కపూర్, సంజ‌య్ ద‌త్‌ల మ‌ధ్య ఎలాంటి భీక‌ర‌మైన యుద్ధం జ‌రుగుతుందో తెలియాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగాల్సిందే. 'షంషేరా' సినిమా హిందీతో పాటు త‌మిళ, తెలుగు భాష‌ల్లో జూలై 22న‌ విడుద‌ల కానుంది. ర‌ణ్‌బీర్ క‌పూర్ 'షంషేరా, 'బ్రహ్మాస్త్రం' సినిమాలతో మొద‌టి సారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్నారు.

Read More: Alia Bhatt: తల్లి కాబోతున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. స్కానింగ్ ఫొటోలు వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!