బర్త్‌డే కేక్‌ కట్‌ చేస్తూ.. నవ్వులు చిందిస్తూ.. నెట్టింట రంభ (Rambha) ఫోటోలు వైరల్

Updated on Jun 07, 2022 10:56 AM IST
ఫ్యామిలీతో కలిసి కేక్ కట్‌ చేస్తున్న రంభ (Rambha)
ఫ్యామిలీతో కలిసి కేక్ కట్‌ చేస్తున్న రంభ (Rambha)

తన అందం, నటనతో టాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ (Rambha). చిరంజీవి నుంచి దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించి.. టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని కెనడాలో సెటిల్‌ అయిపోయింది. అప్పుడప్పుడూ సోషల్‌ మీడియాలో కనిపించడం తప్పితే పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమైన రంభ.. లేటెస్ట్‌ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇన్నాళ్లుగా ఎక్కడా కనిపించని బ్యూటిఫుల్‌ హీరోయిన్ రంభ ఫోటోలు నెట్‌లో ఎందుకు హల్‌చల్‌ చేస్తున్నాయని అనుకుంటున్నారా. స్పెషల్ ఏంటంటే సోమవారం రంభ పుట్టినరోజు. దీంతో ఆమె భర్త పిల్లలతో కలిసి బర్త్‌డే కేక్ కట్‌ చేసి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఆ ఫోటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఫ్యామిలీతో కలిసి కేక్ కట్‌ చేస్తున్న రంభ (Rambha)

ఫ్యామిలీతో కలిసి కేక్ కట్‌ చేస్తున్న రంభ (Rambha)

ఫ్యామిలీతో కలిసి కేక్ కట్‌ చేస్తున్న రంభ (Rambha)

ఆ ఫోటోల్లో ఒక పక్కన గులాబీ పూలు, ఆ పక్కనే నవ్వులు చిందిస్తూ కూర్చున్న రంభ ఫోటోలు చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. కేక్‌ కట్‌ చేస్తున్న రంభను చూడడానికి రెండు కళ్లు చాలవా అన్నట్టుగా ఫోటోలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్ వైరల్ అవుతున్నాయి. వీటిపై రంభ అభిమానులు ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి తర్వాత సినిమాలతోపాటు మీడియాకు కూడా దూరంగా ఉంటోంది రంభ. ఈ భామకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు.

ఈ ఏడాది శర్వానంద్, సిద్ధార్ధ్‌, జగపతిబాబు కాంబినేషన్‌లో వచ్చిన మహాసముద్రం సినిమాలో రంభకు డెడికేట్‌ చేస్తూ ఆమె పేరు మీద పాట కూడా చేశారు. ఆ సినిమాకు డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్ట్‌ చేశాడు. కాగా, మహాసముద్రం సినిమాలో రంభకు ఫ్యాన్‌గా జగపతిబాబు నటించాడు. అయితే ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.

రంభకు డెడికేట్‌ చేసిన పాటకు మాత్రం సోషల్ మీడియాలో మంచి వ్యూయర్‌‌షిప్ దక్కింది. వెండి తెరపై రంభ కనిపించి చాలా సంవత్సరాలే గడిచింది. రంభ (Rambha) రీఎంట్రీకి ప్లాన్‌ చేస్తోందనే వార్తలు కూడా ఇటీవల వచ్చాయి. ఇప్పుడు ఫోటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తుండడంతో ఆ వార్తలు నిజమేనేమో అనే సందేహం కలుగుతోంది. ఈ విషయంపై క్లారిటీ కావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే మరి.

Read More: సుందరానికి పెళ్లైనా, కాకపోయినా, ఏమైనా సెలబ్రేషనేరా.. అంటున్న నాని 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!