ఆచార్య (Acharya) ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Updated on May 13, 2022 10:12 PM IST
చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌లు తొలిసారి కలిసి పనిచేసిన ప్రాజెక్టు కావడంతో, అభిమానులు ఈ చిత్రంపై ఆశలు బాగానే పెట్టుకున్నారు. అలాగే ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా కితాబు పొందిన కొర‌టాల శివ డైరెక్షన్ చేసిన సినిమా కావడంతో, ఇదే ప్రాజెక్టు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.
చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌లు తొలిసారి కలిసి పనిచేసిన ప్రాజెక్టు కావడంతో, అభిమానులు ఈ చిత్రంపై ఆశలు బాగానే పెట్టుకున్నారు. అలాగే ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా కితాబు పొందిన కొర‌టాల శివ డైరెక్షన్ చేసిన సినిమా కావడంతో, ఇదే ప్రాజెక్టు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

తండ్రీ, కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. కొర‌టాల శివ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్త నిర్మాణంలో ఏప్రిల్ 29 తేదిన ఈ సినిమా విడుద‌లైంది. 

చిరంజీవి - రామ్ చ‌ర‌ణ్‌లు తొలిసారి కలిసి పనిచేసిన ప్రాజెక్టు కావడంతో, అభిమానులు ఈ చిత్రంపై ఆశలు బాగానే పెట్టుకున్నారు. అలాగే ఇప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడిగా కితాబు పొందిన కొర‌టాల శివ డైరెక్షన్ చేసిన సినిమా కావడంతో, ఇదే ప్రాజెక్టు టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.  కానీ సినిమా అనుకున్నంత విజయాన్ని నమోదు చేయలేదు. మెగాభిమానులు కూడా ఈ చిత్ర ఫలితాలపై నిరాశతో ఉన్నారు. 

తాజాగా వచ్చిన కొత్త అప్డేట్ ప్రకారం, ‘ఆచార్య’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మే 20 తేదిన ‘ఆచార్య’ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అజయ్, వెన్నెల కిషోర్, సత్యదేవ్, సోనూసూద్, జిస్సు సేన్ గుప్తా, తనికెళ్ళ భరణి, బెనర్జీ మొదలైన వారు ముఖ్య పాత్రలు పోషించారు.

అలాగే నటి రెజీనా కాసెండ్రా ఓ స్పెషల్ సాంగ్‌తో అలరించింది.ఇక మణిశర్మ అందించిన సంగీతం శ్రోతలను బాగానే ఆకట్టుకున్నా, చిత్రం మాత్రం థియేటర్ల ప్రేక్షకులకు నిరాశే మిగిల్చింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!