కంటెస్టెంట్లు చేసిన ప‌నికి ఢీ స్టేజిపైనే ఏడ్చేసిన (Priyamani) ప్రియమ‌ణి

Updated on May 06, 2022 08:50 PM IST
ప్రియమ‌ణి (Priyamani  in Dhee Dance Show)
ప్రియమ‌ణి (Priyamani in Dhee Dance Show)

బుల్లితెరపై ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ (Dhee Show) షో గురించి అందరికీ తెలిసిందే. వారంలో ప్ర‌తి బుధవారం ఈ కార్యక్రమం ప్రసారమ‌వుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తోంది. ఈ షోకు ఒకప్ప‌డు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ లలో ఒకరైన హీరోయిన్ ప్రియమణి (Priyamani) జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్ప‌టికి వ‌రుస‌గా ఐదు సంవ‌త్స‌రాలుగా ఆమె ఈ షోలో జ‌డ్జిగా చేస్తోంది.

అయితే, ఈ షో లో తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న ప్రియమణి ఎంతో ఎమోషనల్ అయినట్టు తెలుస్తోంది. ప్రియమ‌ణి లవ్ స్టోరీని కంటెస్టెంట్స్ స్టేజీపై ఎంతో అద్భుతంగా కళ్ళకు కట్టినట్టు పర్ఫార్మ్ చేయడంతో ఈమె ఎమోషనల్ అయ్యారు. 

ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఆర్గనైజేషన్ లో భాగంగా ఆమెకు ముస్తఫా అనే వ్య‌క్తితో పరిచయం అయింది. దీంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ త‌ర్వాత‌ అలా వీరిద్దరూ వివాహం చేసుకుందాం అనుకునే సమయానికి తమ మతం అడ్డుగా వ‌చ్చింది. దీంతో వీరిద్దరి మతాలు వేర్వేరు కావడంతో వీరి పెళ్ళికి తమ కుటుంబ సభ్యులు అభ్యంతరాలు తెలిపారట. ఈ నేప‌థ్యంలో ఎన్నో అడ్డంకులు దాటుకొని ముస్తఫా ప్రియమణి (Priyamani) జంట‌ ఒకటయ్యారు. 

తన వివాహసమయంలో పడిన సూటిపోటి మాటలను గుర్తు తెచ్చుకొని కన్నీటి పర్వతం అయింది ఈ హీరోయిన్. తన జీవితంలో ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురొచ్చినా ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుని చాలా ఆనందంగా ఉన్నామని ఎమోషనల్ గా తెలియజేసింది ప్రియమణి. 

ఈ విధంగా తన లవ్ స్టోరీని తలుచుకొని ఏడ్చిన ప్రియమణికి కంటెస్టెంట్స్ సాయి-నైనిక‌ ఊహించని విధంగా గిఫ్ట్ ఇచ్చారు. ఈ త‌రుణంలో వేదికపైనే ప్రియమణికి కొరియోగ్రాఫర్ సాయి ఒక గిఫ్ట్ అందజేశారు. ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూసిన ప్రియమణి ఒక్కసారిగా బోరున విల‌పించారు. మరి ఆ గిఫ్ట్ లో ఏముందనే విషయానికి వస్తే… అందులో ప్రియమణి తన అమ్మమ్మ తో కలిసి ఉన్న ఒక పెయింటింగ్ ఉంది. దాన్ని చూసిన ప్రియ‌మ‌ణి ఒక్కసారిగా ఆనందంతో పాటు ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ప్రియమణి తన అమ్మమ్మ అంటే ఎంతో ఇష్టమని ఇదివరకే ఎన్నో సార్లు ఆమె గురించి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

కాగా, ప్రియ‌మ‌ణి హీరోయిన్ అయ్యాక తమిళ ఇండస్ట్రీలో పరుత్తివీరన్ అనే సినిమాకి నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఆరు భాషలలో హీరోయిన్ గా నటిస్తున్న ఆమె ఇప్ప‌టివ‌ర‌కు 60కి పైగా సినిమాలలో నటించింది. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!