'అత్తారింటికి దారేది' ఫేమ్ ప్రణీతా సుభాష్ (Pranitha Subash) పై నెటిజన్ ట్రోలింగ్.. దీటుగా బదులిచ్చిన కన్నడ భామ

Updated on Aug 06, 2022 02:19 PM IST
ప్రణీత సుభాష్ (Pranitha Subhash) తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ చిత్రాలలో కూడా నటించారు.  కన్నడ చిత్రం 'పోకిరి' ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.
ప్రణీత సుభాష్ (Pranitha Subhash) తెలుగుతో పాటు తమిళం, కన్నడం, హిందీ చిత్రాలలో కూడా నటించారు. కన్నడ చిత్రం 'పోకిరి' ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

తెలుగులో ఏం పిల్లో ఏం పిల్లడో, అత్తారింటికి దారేది, పాండవులు పాండవులు తుమ్మెద లాంటి సినిమాలతో బాగా పాపులర్ అయిన నటి ప్రణీతా సుభాష్ (Pranitha Subhash). ఇటీవలే ఈమెపై పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆమె ఓ పూజా కార్యక్రమంలో భాగంగా తన భర్త నితిన్ రాజు పాదాలను ఒక పల్లెంలో పెట్టి కడగడమే అందుకు కారణం.  

తరతరాల నుండీ స్త్రీలు ఇలాంటి ఆచారాలు పాటించడం వల్లే, వారి హక్కులకు కాలం చెల్లుతుందని చెబుతూ పలువురు నెటిజన్లు ప్రణీత చేసిన పని పట్ల తమ విముఖతను తెలిపారు. దానికి కూడా ప్రణీత దీటుగానే బదులిచ్చారు.

"నేను ఆధునిక భావాలున్న ఓ నటిని అయ్యినంత మాత్రాన, తరతరాల నుండి మా కుటుంబం నుండి సంక్రమించిన ఆచారాలను పాటించకూడదని రూల్ ఏమీ లేదు. నా నమ్మకాన్ని కాదనే హక్కు మీకెవరు ఇచ్చారు" అని తెలిపారు. 

నేను సంప్రదాయవాదిని

"నేను సంప్రదాయ భావాలు కలిగిన అమ్మాయిని. నేను ప్రేమించే పనిని నేను చేస్తాను. నాకు నా భావాలు, విలువలు, ఆచారాలు, కుటుంబం.. ఇవే ముఖ్యం. ప్రతీ మనిషి జీవితంలో రెండు కోణాలు ఉంటాయి.

నేను గత సంవత్సరం కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నాను. కానీ ఫోటో షేర్ చేయలేదు. మా వంశానికి చెందిన కజిన్స్, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. అందులో తప్పులేదు" అని చెప్పుకొచ్చారు. 

మిశ్రమ స్పందనలు

అయితే ప్రణీత పోస్టు పై మిశ్రమ స్పందనలు రావడం గమనార్హం. ఆమె చర్యను సమర్థించేవారూ, వ్యతిరేకించేవారూ రెండు వర్గాలుగా వీడిపోయి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రణీత తన మనసులోని మాటను బయటపెట్టి, ఈ వివాదానికి ముగింపు పలికారు. 

ప్రణీత కర్ణాటకలో పుట్టి పెరిగారు. 2021 లో ప్రముఖ పారిశ్రామికవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఇటీవలే ఈ జంటకు ఓ బిడ్డ కూడా జన్మించింది. ప్రణీత ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇదే క్రమంలో ఇటీవలే ఆమె పంచుకున్న ఫోటో వివాదానికి దారి తీసింది. 

Read More: ఇండస్ట్రీ స్టామినాను పెంచిన పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) టాప్‌ సినిమాలు.. మీకోసం ప్రత్యేకం

 

 


టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!