ప్రభాస్‌ (Prabhas) అప్‌డేట్స్‌ మేమే ఇస్తామంటున్న పీఆర్‌‌ టీం

Updated on May 01, 2022 06:02 PM IST
సలార్‌‌లో ప్రభాస్ (Prabhas)
సలార్‌‌లో ప్రభాస్ (Prabhas)

రెబల్‌స్టార్ ప్రభాస్ (Prabhas)కు సంబంధించిన ఏ విషయమైనా ప్రస్తుతానికి వైరలే. ప్రభాస్ సినిమాల గురించి ఎప్పుడు ఏ సమాచారం అందుతుందా అని అభిమానులతోపాటు సినీ ప్రేమికులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రభాస్‌కు సంబంధించి అనేక వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంటాయి. అవి నిజమా కాదా తెలుసుకోవాలని అందరూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు కూడా. ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండబోవని తెలుస్తోంది. ప్రభాస్‌కు సంబంధించిన ఏ విషయమైనా తామే తెలియజేస్తామని చెబుతోంది ఆయనకు చెందిన పీఆర్‌‌ టీమ్. అంతేనా ప్రభాస్‌కు సంబంధించిన లేటెస్ట్‌ ఫోటోలను మాత్రమే వాడాలని సూచిస్తోంది ఆ టీమ్.

ప్రభాస్ సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రభాస్‌ పీఆర్‌‌వో నుంచి లేదా ప్రభాస్‌ పీఆర్‌‌ టీమ్‌ నుంచి తెలుసుకోవచ్చు. అదే సమయంలో ప్రభాస్‌కు సంబంధించిన న్యూస్‌ను పబ్లిష్‌ చేసే సమయంలో కూడా ఆయనకు చెందిన తాజా ఫోటోలను మాత్రమే పోస్ట్‌ చేయాలని కోరుతున్నామని చెప్తోంది పీఆర్‌‌ టీమ్. కృష్ణంరాజు నట వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రభాస్‌.. పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు. ఈశ్వర్‌‌ సినిమాతో 2002లో ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్‌.. రాఘవేంద్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కొద్దిగా దగ్గరయ్యాడు. తర్వాత త్రిషతో కలిసి నటించిన రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘వర్షం’ ప్రభాస్‌ కెరీర్‌‌ను మలుపుతిప్పింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఛత్రపతి’తో ప్రభాస్‌ మాస్‌ ఇమేజ్‌తోపాటు ఫాలోయింగ్‌ కూడా విపరీతంగా పెరింగింది. అనంతరం డార్లింగ్‌, మిస్టర్ పర్‌‌ఫెక్ట్‌, బిల్లా, బుజ్జిగాడుతో లవర్‌‌బాయ్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. మిర్చి సినిమాలో నటనకు బెస్ట్‌ యాక్టర్‌‌గా నంది అవార్డు అందుకున్నాడు రెబల్‌స్టార్.

వీటన్నింటి తర్వాత రాజమౌళి తీసిన బాహుబలి సినిమాతో ప్రభాస్‌ (Prabhas) పాన్‌ ఇండియా స్టార్‌‌గా ఎదిగాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి–2 కూడా ప్రభాస్‌ రేంజ్‌ను మరింత పెంచింది. వెయ్య కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి ఇండియన్‌ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్‌ సినిమాలు చేశాడు. ప్రస్తుతం సలార్‌‌తోపాటు ఆదిపురుష్‌ సినిమాల్లో నటిస్తున్నాడు ఈ రెబల్‌స్టార్‌‌.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!