Prabhas & Maruthi: ప్రభాస్‌తో కామెడీ చేయించనున్న మారుతి

Updated on Apr 19, 2022 04:37 PM IST
మరో కొత్త ప్రయోగానికి ప్రభాస్ సిద్ధం
మరో కొత్త ప్రయోగానికి ప్రభాస్ సిద్ధం

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే యూత్‌కు దగ్గరయ్యే కథ, కథనం అందులో నుంచి కామెడీని రాబట్టడంలో మారుతి స్పెషలిస్ట్‌ అని అందరికీ తెలిసిందే. ఇక, వీరిద్దరి కలయికలో పాన్‌ ఇండియా సినిమా రాబోతోందని ఇప్పటికే అనౌన్స్‌ చేశారు. అయితే కథేంటి, ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు దానిపై ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ వచ్చింది. వచ్చే ఏడాది సినిమా షూటింగ్ స్టార్ట్‌ చేసి 2024 సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 

తన తదుపరి సినిమాలో ముగ్గురు కొత్త హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్న ప్రభాస్

ఔట్‌ అండ్‌ ఔట్‌కామెడీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా మాస్‌మసాలా ఎంటర్‌‌టైనర్‌‌ అని, ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్‌ స్క్రీన్ షేర్‌‌ చేసుకోనున్నారని సినీవర్గాల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే టైటిల్‌ అనుకుంటున్నారు. ప్రస్తుతం గోపిచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్న మారుతి.. తరువాత చిత్రం ప్రభాస్‌తోనే అని తెలుస్తోంది.

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!