పవర్‌‌స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌కు డబుల్ థమాకా.. ‘జల్సా’తోపాటు ‘తమ్ముడు’ సినిమా కూడా!

Updated on Aug 28, 2022 09:51 PM IST
భీమ్లా నాయక్‌ సినిమాతో భారీ హిట్‌ అందుకున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు
భీమ్లా నాయక్‌ సినిమాతో భారీ హిట్‌ అందుకున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు

టాలీవుడ్‌లో పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan)కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాల కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తుంటారు. తాజాగా పవన్‌ హీరోగా వచ్చిన భీమ్లానాయక్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం పవన్‌ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.

ఇక టాలీవుడ్‌లో ప్రస్తుతం పాత సినిమాలను రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తోంది. సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీహిట్‌ పోకిరి సినిమాను డిజిటలైజ్ చేసి పలు థియేటర్లలో ప్రదర్శించారు. ఈ సినిమాకు ఏకంగా రూ.కోటి డబ్బై లక్షల గ్రాస్ వసూలైంది.

భీమ్లా నాయక్‌ సినిమాతో భారీ హిట్‌ అందుకున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు

ఒక రోజు ముందుగానే..

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రదర్శించిన ‘ఘరానా మొగుడు’ సినిమాకు చాలా చోట్ల మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక సెప్టెంబర్ 2వ తేదీన పవర్‌‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 14 ఏండ్ల క్రితం వచ్చిన ‘జల్సా’ సినిమాను డిజిటలైజ్‌ చేసి రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. జల్సా సినిమాను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని అనుకున్నా.. సెప్టెంబర్‌‌ 1వ తేదీనే విడుదల చేయనున్నారు. 

టీవీలోనూ, యూట్యూబ్‌లోనూ విపరీతంగా వ్యూస్‌ను దక్కించుకున్న జల్సా సినిమాను 4కె రిజల్యూషన్‌లో చూడాలని పవర్‌‌స్టార్ అభిమానులు తహతహలాడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాను కూడా లైన్‌లో పెడుతున్నారు మేకర్స్. ఆగస్టు 31వ తేదీర వినాయక చవితి సందర్బంగా పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్‌డేకు అడ్వాన్స్‌ విషెస్ అంటూ పోస్టర్స్ వేస్తున్నారు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో ఇప్పటికే బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

Read More : "హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు"గా అద‌ర‌గొట్ట‌నున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan).. రెగ్యుల‌ర్ షూటింగ్ అప్‌డేట్స్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!