Ananya Nagalla: సముద్రం మధ్యలో టాలీవుడ్ (Tollywood) హాట్ బ్యూటీ అనన్య నాగళ్ళ బర్త్ డే పార్టీ.. ఫొటోలు వైరల్!

Updated on Aug 06, 2022 08:36 PM IST
'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఆ తర్వాత 'వకీల్‌ సాబ్‌' చిత్రంతో  మరింత పాపులర్‌ అయింది.
'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది అనన్య నాగళ్ల (Ananya Nagalla). ఆ తర్వాత 'వకీల్‌ సాబ్‌' చిత్రంతో మరింత పాపులర్‌ అయింది.

Ananya Nagalla: నిత్యం హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ చేసే తెలుగు హీరోయిన్‌ అనన్య నాగళ్ల తాజాగా తన బర్త్ డే పార్టీలో రెచ్చిపోయింది. ఆమె తన ఫ్రెండ్స్ తో కలిసి  ఏకంగా సముద్రం మధ్యలో బోట్‌లో సెలబ్రేట్‌ చేసుకుంది. తాజాగా ఆ ఫొటోలను అభిమానులతో పంచుకుని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది ఈ బ్యూటీ. అంతేకాదు నైట్ పార్టీలోనూ రచ్చ చేసింది. కేక్‌ ముఖానికి పూసుకుని, బీర్‌ బాటీల్‌తో చీర్స్ కొడుతూ నానా రచ్చ చేసింది. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

అనన్య నాగళ్ల తెలుగులో చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవిత క‌థ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మ‌ల్లేశం' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్‌ సాబ్‌' చిత్రంతో అనన్య నాగళ్ల (Ananya Nagalla) మరింత పాపులర్‌ అయింది. ఈ సినిమాతో పాటు యువ హీరో నితిన్ (Nithiin) నటించిన మాస్ట్రో (Maestro) అనే సినిమాలో నటించింది. మాస్ట్రో హిందీలో ఘన విజయాన్ని అందుకున్న ‘అంధాధూన్’ సినిమాకు తెలుగు రీమేక్‌‌గా వచ్చింది. ఈ తెలుగు రీమేక్‌కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఇందులో అనన్య నాగళ్ళ పవిత్ర పాత్రలో నటించింది.

అనన్య నాగళ్ల (Ananya Nagalla) పర్‌ ఫెక్ట్ నడుమందాలతో కనువిందు చేస్తూ కుర్రాళ్లని తన వైపు తిప్పుకుంటుంది. ఈ ఫోటోల ద్వారా సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ని అమాంతం పెంచుకుంటుంది. ఇక, అనన్య గ్లామర్‌ ఫోటోలకు సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనన్య నాగళ్ల సాఫ్ట్ వేర్‌గా జాబ్‌ని వదులుకుని మరీ సినిమాల్లోకి వచ్చింది.

కెరీర్‌లో మొదట్లో ముందుగా పలు షార్ట్ ఫిల్స్‌లో నటించింది అనన్య నాగళ్ల (Ananya Nagalla). అందులో ఈమె నటించిన ‘షాదీ’ అనే షార్ట్ సినిమాలో నటనకు బెస్ట్ యాక్ట్రెస్‌గా SIIMA అవార్డ్స్‌కు నామినేట్ అయింది. ప్రస్తుతం హీరోయిన్ పాత్రలనే కాకుండా.. నటనకు అవకాశం ఉన్న సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అందుకోసం రెగ్యూలర్‌గా హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ మేకర్స్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి ఆమె ప్రయత్నాలు ఫలించి మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు వరిస్తాయేమో చూడాలి.

Read More: చేపల మార్కెట్‌లో దర్శనమిచ్చిన భీమ్లా నాయక్ (Bheemla Nayak) బ్యూటీ నిత్యా మీనన్.. వీడియో వైరల్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!