Adipurush: 'ఆదిపురుష్' నుంచి ప్ర‌భాస్‌ (Prabhas) పోస్ట‌ర్ రిలీజ్.. డార్లింగ్ ఫ్యాన్స్‌కు ముందే మొద‌లైన‌ పండుగ

Updated on Sep 30, 2022 10:50 AM IST
Adipurush:  ఆదిపురుష్‌లో  ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా  రావ‌ణ సంహారం చేసే స‌న్నివేశం నుంచి ఓం రౌత్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.
Adipurush: ఆదిపురుష్‌లో  ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా రావ‌ణ సంహారం చేసే స‌న్నివేశం నుంచి ఓం రౌత్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) న‌టిస్తున్న 'ఆదిపురుష్' నుంచి ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. రాముడి పాత్ర‌లో ప్ర‌భాస్ ఆ పోస్ట‌ర్‌లో క‌నిపించారు. రాముడిగా ప్ర‌భాస్ రావ‌ణ సంహారం చేసే స‌న్నివేశం నుంచి ఓం రౌత్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రో పోస్ట‌ర్‌, టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 2న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ప‌లు భాష‌ల్లో ఆదిపురుష్ పోస్ట‌ర్ల‌ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

రాముడిగా ప్ర‌భాస్‌ను చూసిన అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్ర‌భాస్ లుక్ అద‌ర‌హో అంటున్నారు. త‌మ హీరోను రాముడిగా అందంగా చూపించిన ఓం రౌత్‌పై డార్తింగ్ ఫాన్స్‌ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆదిపురుష్ ఇండియ‌న్ సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Adipurush:  ఆదిపురుష్‌లో  ప్ర‌భాస్ (Prabhas) రాముడిగా  రావ‌ణ సంహారం చేసే స‌న్నివేశం నుంచి ఓం రౌత్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.

విజువ‌ల్స్‌తో వండ‌రే

రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' సినిమాను బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ‌డా ద‌ర్శ‌క‌, నిర్మాత ఓం రౌత్ నిర్మిస్తున్నఈ 3 డీ చిత్రంలో  ప్ర‌భాస్ (Prabhas) రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బాలీవుడ్ బ్యూటీ కృతి స‌న‌న్ జానకి పాత్రలో ప్ర‌భాస్‌కు జోడిగా న‌టించ‌నున్నారు. రావ‌ణుడి పాత్ర‌లో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. ఇక సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు.

'బాహుబలి' కన్నా పదిరెట్లు VFX ఎఫెక్ట్స్ ఈ సినిమాలో చూడచ్చు. తెలుగు, హిందీ భాష‌ల్లో 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు.

'ఆదిపురుష్' 3డీలో

ఢిల్లీలోని రామ్‌లీలా క‌మిటీ ఈ సంవత్సరం విజ‌య ద‌శ‌మి ఉత్స‌వాల‌కు ముఖ్య అతిథిగా సినీ నటుడు ప్ర‌భాస్ (Prabhas)ను ఆహ్వానించింది. 'ఆదిపురుష్‌' చిత్రంలో రాముడిగా న‌టించిన ప్ర‌భాస్‌తో ఈసారి రావ‌ణ సంహారం చేయించ‌డానికి కమిటీ సంకల్పించింది.

ద‌స‌రా న‌వ‌రాత్రి ఉత్స‌వాల సంద‌ర్భంగా 'ఆదిపురుష్' సినిమా ప్ర‌మోష‌న్ల‌ను షురూ చేశారు. అందులో భాగంగా అక్టోబ‌ర్ 2న ఆదిపురుష్ సినిమా నుంచి ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్నారు. అంతేకాకుండా ఈ సినిమా టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేస్తున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తెలిపారు. 

Read More: Adipurush:'ఆదిపురుష్' అప్‌డేట్స్ రిలీజ్ చేసిన‌ ద‌ర్శ‌కుడు.. అయోధ్య‌లో రాముడిగా క‌నిపించ‌నున్న ప్ర‌భాస్ (Prabhas)!

Advertisement
Credits: Twitter

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!