Paga Paga Paga: 'ప‌గ ప‌గ ప‌గ' అంటూ విల‌న్‌గా మారిన సంగీత ద‌ర్శ‌కులు కోటి!!!

Updated on Aug 13, 2022 03:19 PM IST
Paga Paga Paga Look: 'ప‌గ ప‌గ ప‌గ' చిత్రంలో కోటి (Koti) విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కోటికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.
Paga Paga Paga Look: 'ప‌గ ప‌గ ప‌గ' చిత్రంలో కోటి (Koti) విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కోటికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

Paga Paga Paga : టాలీవుడ్ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు కోటి (Koti) త‌న పాట‌ల‌తోనే కాకుండా న‌ట‌న‌తో కూడా వెండితెర‌పై వినోదం పంచనున్నారు. 'ప‌గ ప‌గ ప‌గ' అనే సినిమాలో కోటి ఓ స్పెష‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నారు. ఆ సినిమాకు సంబంధించిన కోటి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. విల‌న్ లుక్‌లో కోటిని చూసిన ప్రేక్ష‌కులు స‌ర్‌ప్రైజ్‌గా ఫీల్ అయ్యారు. వెండితెర‌పై కోటి విల‌నిజం ఎలా ఉంటుందో చూసేందుకు ఆతృత‌తో ఎదురు చూస్తున్నారు. 

పాట‌లే కాదు డైలాగులు కూడా అద‌ర‌గొట్టిన కోటి

సూప‌ర్ స్టార్ కృష్ణ హీరోగా న‌టించిన 'అమ్మ‌దొంగ' సినిమాతో కోటి (Koti) సంగీత దర్శకులుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప‌లు అగ్ర హీరోల సినిమాల‌కు మ్యూజిక్ డైరెక్టరుగా కోటి ప‌నిచేశారు. అంతేకాకుండా, బుల్లితెర‌పై ఎన్నో పాట‌ల కార్య‌క్ర‌మాలకు న్యాయనిర్ణేతగా కోటి వ్య‌వ‌హరిస్తున్నారు. ప్ర‌స్తుతం న‌ట‌న‌తోనూ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు కోటి రెడీ అయ్యారు.

విల‌న్‌గా కోటి

అభిలాశ్ సుంక‌ర‌, దీపికా ఆరాధ్య హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం 'ప‌గ ప‌గ ప‌గ‌'. ఈ సినిమాకు వుయ్యూరు ర‌వి శ్రీ దుర్గ ప్ర‌సాద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 'ప‌గ ప‌గ ప‌గ' చిత్రంలో కోటి (Koti) విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. కోటికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఫ‌స్ట్ లుక్‌తో పాటు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో కోటి చెప్పే డైలాగులు ఆస‌క్తిగా అనిపించాయి. 'హ‌లో ఈ జోగిపేటోడికి ప‌నిస్తే.. వాడు ఆఖ‌రి క్ష‌ణంలో ఉన్నా ప‌ని పూర్తి చేసే చ‌స్తాడు' అంటూ కోటి మాస్ డైలాగు ఓ రేంజ్‌లో పేలింది. 'సెహ‌రి' సినిమాతో న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన కోటి.. విల‌న్‌గా కూడా మెప్పిస్తానంటున్నారు,

Read More: మ‌హేష్ బాబు (Mahesh Babu) బొమ్మ‌కు ద‌ద్ద‌రిల్లిన బాక్సాఫీస్.. పోకిరి క‌లెక్ష‌న్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!