RRR: రాజమౌళి ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్. ఎలా రిలీజ్ చేస్తున్నారంటే..
దర్శక ధీరుడు రాజమౌళి నిర్మించిన సినిమా ఆర్.ఆర్.ఆర్ (RRR) ఇండియన్ రికార్డులను సృష్టించింది. ప్రమోషన్లలో రాజమౌళి కొత్త స్టైల్ చూపిస్తారు. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. మరి రాజమౌళి ఏ ఐడియాతో స్ట్రీమింగ్ చేయిస్తారో.
ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాను రాజమౌళి ఓటీటీలో విడుదల చేయనున్నారు. అందుకోసం సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీలో ఎవరూ విడుదల చేయని స్టైల్లో రిలీజ్ చేస్తారట. ఇప్పటికే దాదాపు అన్ని పొటలకు కొత్త రూపు ఇచ్చారు రాజమౌళి. సినిమాలో ఇంకెన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయోనని ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఆర్.ఆర్.ఆర్ సినిమా మే 20న జీ5, నెట్‌ఫ్లిక్స్‌లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో ఆర్.ఆర్.ఆర్ (RRR) చూడాలంటే కొంత డబ్బును ఆ సంస్థలకు చెల్లించాలట. జూన్ 3 నుంచి అందరికీ అందుబాటులోకి వస్తుంది. రాజమౌళి ఈ తరహాలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తే ... మరో రికార్డు బ్రేక్ చేసినట్టే. ఓటీటీలో కొత్త తరహా ప్రయోగం చేసిన ఇండియన్ సినిమాగా నిలుస్తుంది.