Naga Chaitanya: నాగచైతన్య ‘థ్యాంక్యూ’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసేది అప్పుడే! డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Updated on Jul 12, 2022 04:56 PM IST
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) థ్యాంక్యూ సినిమా ట్రైలర్‌‌ రిలీజ్  పోస్టర్
అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) థ్యాంక్యూ సినిమా ట్రైలర్‌‌ రిలీజ్ పోస్టర్

‘ల‌వ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ సినిమాల విజయాలతో జోష్‌ మీద ఉన్నారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya). త్వరలోనే థ్యాంక్యూ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు ఈ యంగ్ హీరో. రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌పై దిల్‌ రాజు నిర్మించారు. ఎస్‌ఎస్‌ థమన్ మ్యూజిక్ అందించారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థ్యాంక్యూ సినిమా జూలై 22న విడుదల కాబోతోంది.ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచింది చిత్ర యూనిట్. అందులో భాగంగా ఇప్పటికే రిలీజ్‌ చేసిన సాంగ్స్, టీజర్‌‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో బిగ్ అప్‌డేట్‌ను నాగచైతన్య రివీల్ చేశారు. థ్యాంక్యూ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు.

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) థ్యాంక్యూ సినిమా పోస్టర్

ఎన్ని గంటలకు అంటే?

నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న థ్యాంక్యూ సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని లాక్ చేసినట్టు ప్రకటించాడు. జూలై 12వ తేదీ సాయంత్రం 6:03 నిమిషాలకు థ్యాంక్యూ ట్రైలర్‌‌ను రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నాగచైతన్య.. ఒక పోస్టర్‌‌ను కూడా రిలీజ్ చేశారు. థ్యాంక్యూ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కాగా ప్రస్తుతం చై.. అమెజాన్‌ ఓటీటీ నిర్మిస్తున్న దూత అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ఆ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు నాగచైతన్య (Naga Chaitanya).

Read More : పుష్ప2 సినిమాకు అల్లు అర్జున్ (Allu Arjun) ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే? వైరల్ అవుతున్న న్యూస్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!