Aishwarya Rajesh: ఆసక్తి రేకెత్తించేలా ఐశ్వర్యా రాజేష్‌ ‘డ్రైవర్‌‌ జమున’ ట్రైలర్‌‌

Updated on Jul 07, 2022 12:47 PM IST
‘డ్రైవర్‌‌ జమున’ సినిమా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌  (Aishwarya Rajesh)
‘డ్రైవర్‌‌ జమున’ సినిమా హీరోయిన్‌ ఐశ్వర్యా రాజేష్‌ (Aishwarya Rajesh)

కౌసల్యా కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు ఐశ్వర్యా రాజేష్  (Aishwarya Rajesh). తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య.. విజయ్‌ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్, సాయిధరమ్‌ తేజ్‌తో రిపబ్లిక్, నేచురల్ స్టార్‌‌ నానితో టక్ జగదీష్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆమె నటించిన డ్రైవర్ జమున సినిమా ట్రైలర్ రిలీజైంది.

ఇప్పటికే తమిళంలో హిట్ సినిమాలు చేసి తన నటనతో విమర్శకుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు ఐశ్వర్యా రాజేష్‌. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లతో అభిమానులకు దగ్గరయ్యారు.

తాజాగా ఐశ్వర్య నటించిన లేడీ ఓరియంటెడ్‌ సినిమా ‘డ్రైవర్ జమున’. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 

క్యాబ్‌ డ్రైవర్ కష్టాలు..

బతుకు తెరువు కోసం క్యాబ్ డ్రైవర్‌‌గా మారిన జమున (ఐశ్వర్యా రాజేష్‌)కు ఎదురైన కష్టాలను సినిమాలో చూపించనున్నట్టు ట్రైలర్‌‌లో తెలుస్తోంది. జమున క్యాబ్‌ను ఒక క్రిమినల్ గ్యాంగ్ బుక్ చేసుకుంటుంది. నక్కపల్లి నుంచి రుషికొండకు ఒక మర్డర్ చేయడానికి బయలుదేరిన గ్యాంగ్‌తో మార్గమధ్యంలో జమున ఎదుర్కొన్న కష్టాలను ట్రైలర్‌‌లో చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ పీ కిన్‌స్లిన్.

ఐశ్వర్యా రాజేష్‌ (Aishwarya Rajesh) వాటిని ఎలా ఎదుర్కొని నిలబడింది అనే కథతో ‘డ్రైవర్ జమున’ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. 90 నిమిషాల వ్యవధిలో జరిగే ఈ రైడ్‌లోని ట్విస్టులు, కీలక మలుపులు ఏంటనేవి తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే . 18 రీల్స్ బ్యాన‌ర్‌పై ఎస్పీ చౌద‌రి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

తెలుగు, త‌మిళంతోపాటు పలు సౌత్‌ భాషల్లో కూడా ‘డ్రైవ‌ర్ జ‌మున’ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. అయితే ‘డ్రైవ‌ర్ జ‌మున’ సినిమా విడుదల తేదీని మాత్రం మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

Read More : Chiranjeevi : చిరంజీవి చిత్రం 'గాడ్ ఫాదర్' లో నటిస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!