‘అంటే సుందరానికీ’ కథలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి .. కానీ ఆ విషయంలో నా కోరిక నెరవేరలేదు : నజ్రియా (Nazriya)

Updated on Jun 08, 2022 04:47 PM IST
నజ్రియా (Nazriya)
నజ్రియా (Nazriya)

'ఇన్ని సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు.అలాగే స్టార్ కావాలనే టార్గెట్‌ ఏదీ పెట్టుకోలేదు. మంచి సినిమాలు చేయాలి.

నా క్యారెక్టర్లతో ప్రేక్షకుల మనసులో చోటు దక్కించుకోవాలి అని మాత్రమే అనుకుంటున్నాను' అంటున్న మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా (Nazriya Nazim) ఇటీవలే మీడియాతో మాట్లాడింది.

ఆమె తెలుగులో నేరుగా నటించిన మొదటి సినిమా ‘అంటే సుందరానికీ’  ఈనెల 10వ తేదీన విడుదల కానుంది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..

పక్కాగా రెడీ అయ్యా..

‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమాలో మొదటిసారి డబ్బింగ్ చెప్పడానికి ఏమీ కష్టంగా అనిపించలేదు. సినిమా కథ విన్న తర్వాత, ఇక ట్రాన్స్‌లేటర్‌‌ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రతి క్యారెక్టర్‌‌ మధ్య జరిగే దానిని అర్ధం చేసుకుని, నేర్చుకున్నాను. ప్రతి పదానికి అర్ధాన్ని తెలుసుకుని, దానిని ఎలా పలకాలో కూడా నేర్చుకున్నాను. షూటింగ్‌ సెట్‌లోకి అడుగుపెట్టే సమయానికి ఫుల్‌గా ప్రిపేర్ అయ్యాను.

మంచి క్యారెక్టర్ అయితేనే చేద్దామని..

చిన్నప్పటి నుంచి సినిమాలు చేసేదాన్ని. అయినా పెళ్లి చేసుకున్న తర్వాత, నాలుగు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాననే ఫీలింగ్ లేదు. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేశాను. కథలు ఎందుకు వినట్లేదని ఫహద్ (భర్త) అడుగుతుండేవాడు. ఇంతకుముందు చేయని డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలని అనుకునేదానిని. అటువంటి కథలు చాలా అరుదుగా వచ్చేవి.


 

రాజా రాణి సినిమాలో  నజ్రియా (Nazriya), ఆర్య

అనుకోకుండా జరిగిందంతే..

రాజా రాణి సినిమా తర్వాత, గ్యాప్ ప్లాన్ చేసింది కాదు. అనుకోకుండా జరిగింది.. అంతే! తెలుగులో సినిమా చేయాలని ఉన్నా, సరైన కథ దొరకలేదు. ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమా విషయానికి వచ్చేసరికి, ఈ కథలో చాలా ఫన్ ఉంది. ఎమోషన్ ఉంది. ఈ కథలో ప్రతి క్యారెక్టర్‌‌కు నటించే ఆస్కారముంది. అలాగే చాలా కమర్షియల్‌గానూ ఉంటుంది. అన్ని అంశాలు ఈ కథలో ఉన్నాయి. ఇటువంటి స్క్రిప్ట్‌ దొరకడం చాలా అరుదు. అందుకే కథ విన్న వెంటనే ఓకే చెప్పేశా.

ప్రేమతోనే బంధాలు..

‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki)  సినిమాలో కులాంతర, మతాంతర వివాహాల గురించి చర్చించాం. పెళ్లి విషయంలో వాటి పట్టింపు ఉండకూడదని అనుకుంటాను. ఏ బంధమైనా, ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. కరోనా తర్వాత జీవితం చాలా చిన్నదని అర్ధమైంది.

 

నజ్రియా (Nazriya)

అమాయకురాలిగా కనిపిస్తా..

అంటే సుందరానికీ’  సినిమాలో లీల అనే క్యారెక్టర్‌‌లో కనిపిస్తాను. అలాగే చాలా స్ట్రాంగ్‌.. పరిణతి ఉన్న అమ్మాయిగా నటించాను. అమాయకురాలిగా కూడా చేశాను. చాలా కోణాలు ఉన్నాయి నా క్యారెక్టర్‌‌లో. అందుకే సవాల్‌గా అనిపించింది. నానితో డ్యాన్స్‌ చేయడానికి చాలా కష్టపడ్డాను. షూటింగ్‌లో ఎంత పిచ్చిగా డ్యాన్స్ చేసినా.. నాని, వివేక్ బాగా చేశావని సపోర్ట్‌ చేసేవారు.

డైరెక్టర్ నిజాయితీపరుడు

డైరెక్టర్ వివేక్ ఆత్రేయ నిజాయితీపరుడు. అది తన సినిమాల్లో కనిపిస్తుంది. ఏ ఎమోషన్‌నూ కథలో బలవంతంగా ఇరికించాలని అనుకోడు. ‘అంటే సుందరానికీ’ (Ante Sundaraniki) సినిమాలో, ఏ కామెడీ సీన్‌‌ను కూడా బలవంతంగా ఇరికించినట్టు ఉండదు. కథలో ప్రతి సన్నివేశం నేచురల్‌గా ఉంటుంది. మరోసారి కూడా నటించాలని అనుకునే దర్శకుల్లో వివేక్‌ కూడా ఒకరు.

 

భర్త ఫహద్‌తో నజ్రియా (Nazriya)

కామన్ ఆడియన్‌గానే కథ వింటా..

జనరల్‌ ఆడియన్‌గానే స్క్రిప్ట్‌ వింటాను. స్టోరీ తెలుగా.. తమిళమా.. స్టార్‌‌ హీరో నటిస్తున్నాడా? అనే విషయాలను ఆలోచించను. కథ, అందులో నా క్యారెక్టర్ నచ్చితే చాలు.. భాషతో సంబంధం లేకుండా నటించడానికి రెడీ అవుతా. మంచి కథలు విన్నప్పుడు ఫహద్‌, నేను ఒకరికొకరు షేర్ చేసుకుంటాం. స్క్రిప్ట్‌ ఫైనల్‌ చేయడంలో మాత్రం, ఎవరి నిర్ణయం వాళ్లదే. మంచి స్క్రిప్ట్‌ వస్తే, తెలుగులో వెంటనే సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఏ భాషలోనైనా, సినిమా చేయడానికి రెడీ. మహేష్‌బాబు, రాంచరణ్, ఎన్టీఆర్‌‌తో సహా తెలుగులోని అందరు హీరోలతో కలిసి పనిచేయాలని ఉంది.

సాఫీగానే జరిగింది

‘అంటే సుందరానికీ’  (Ante Sundaraniki) సినిమాలో లాగానే, నా ప్రేమ కథలో కూడా మంచి డ్రామా ఉండాలని కోరుకునే దానిని. అయితే నా కోరిక నెరవేరలేదు. సాఫీగానే మా పెళ్లి జరిగిపోయింది. ఇంట్లో ఉంటే నేను, ఫహద్ కలిసి సినిమాలు చూస్తాం. ఇద్దరూ నటులమే కనుక వాటి గురించే చర్చించుకుంటాం. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌‌పై ఇద్దరూ ఒకేసారి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాం. అందుకు చాలా హ్యాపీగా ఉంది.. అని మదిలోని భావాలను పంచుకుంది నజ్రియా.

Read More: సుందరానికి పెళ్లైనా, కాకపోయినా, ఏమైనా సెలబ్రేషనేరా.. అంటున్న నాని 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!