యూట్యూబ్‌లో మహేష్‌బాబు (MaheshBabu) ‘మురారి వా’ పాట.. వైరల్‌ అవుతున్న వీడియో

Updated on Jun 07, 2022 05:03 PM IST
‘సర్కారు వారి పాట’లో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్
‘సర్కారు వారి పాట’లో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు (MaheshBabu) హీరోగా వచ్చిన ‘సర్కారు వారి పాట’ మే నెలలో విడుదలై సూపర్‌‌హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను ప్రేక్షకులు, మహేష్‌ అభిమానులు మళ్లీ చూసేలా, మరింత మందిని థియేటర్లకు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

ఇప్పటికే ‘సర్కారు వారి పాట’ సినిమాను అభిమానులు చాలా మంది చూసే ఉంటారు. అంతేకాకుండా ఇటీవలే ఈ సినిమా అమెజాన్‌ ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ప్రైమ్ మెంబర్‌‌షిప్‌ ఉన్న వాళ్లు కూడా రూ.199 కట్టి సినిమా చూడాలనే షరతు పెట్టింది. ఇక, ‘సర్కారు వారి పాట’ సినిమా చూసిన వాళ్లను కూడా మరోసారి థియేటర్‌‌కు తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కొత్తగా ఒక పాటను సినిమాకు యాడ్ చేసినట్టు ప్రకటించింది. మహేష్‌బాబు కెరీర్‌‌ను మలుపు తిప్పిన సినిమాల్లో ఒకటైన ‘మురారి’ సినిమా పేరుతో ‘మురారి వా.. మురారి వా’ అనే లిరిక్స్‌తో ఉన్న పాటను సినిమాలో కలిపింది చిత్ర యూనిట్.

హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ అదిరింది..

తాజాగా ‘మురారి వా’ పాట వీడియోను సోషల్‌ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మహేష్‌బాబు (MaheshBabu), కీర్తి సురేష్‌ డ్యాన్స్, కాస్ట్యూమ్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి. అంతేకాదు.. ఈ పాటలో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. దాంతో ఈ పాట వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా.. బ్యాంకింగ్ సిస్టం, లోన్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లు, రైతు రుణాలను వసూలు చేయడంలో బ్యాంకర్లు అవలంబించే విధానాలను ప్రశ్నిస్తూ తెరకెక్కింది. 

Read More: మహేష్ బాబు రాజమౌళితో చేసే సినిమా సబ్జెక్టు ఏమిటి? అడివి శేష్ "గూఢచారి"కి ప్రేరణ ఎవరు?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!