నేచురల్‌ స్టార్ నాని (Nani) ‘అంటే సుందరానికీ’ సినిమా నుంచి ‘రంగో రంగ’ సాంగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్

Updated on May 24, 2022 12:19 PM IST
అంటే సుందరానికీ సినిమా పోస్టర్
అంటే సుందరానికీ సినిమా పోస్టర్

విభిన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న న‌ట‌న‌తో ప్రేక్షకుల‌ను ఎప్పటిక‌ప్పుడు ఫిదా చేస్తుంటాడు నేచురల్‌ స్టార్ నాని (Nani). రొటీన్‌కు భిన్నంగా ఉన్న క‌థ‌ల‌ను ఎంచుకుంటూ మినిమ‌మ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. నాని న‌టించిన తాజా సినిమా ‘అంటే సుంద‌రానికీ’.

‘బ్రోచేవారెవ‌రురా’ ఫేం వివేక్ ఆత్రేయ ద‌ర్శక‌త్వం వ‌హించిన ఈ సినిమాపై మొద‌టి నుంచి ప్రేక్షకుల్లో మంచి అంచ‌నాలే ఉన్నాయి. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్ అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలో చిత్ర బృందం సినిమాపై అప్‌డేట్స్ ఇస్తూ నాని అభిమానులను, సినీ ప్రేమికులను అల‌రిస్తోంది. ఇప్పుడు మ‌రో అప్‌డేట్‌ను మేక‌ర్స్ ప్రక‌టించారు.

అంటే సుందరానికీ సినిమాలోని ‘రంగో రంగ’ అంటూ సాగే పాట‌ను సోమ‌వారం విడుద‌ల చేయ‌నున్నట్టు పోస్టర్‌‌ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్‌‌లో చేతిలో సైకిల్‌ను మోస్తూ నాని ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఇదివ‌ర‌కే చిత్రం నుంచి విడుద‌లైన ‘ది పంచ‌క‌ట్టు’ ‘ఎంత చిత్రం’ పాట‌ల‌కు నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో న‌జ్రియా హీరోయిన్‌గా న‌టించింది. న‌జ్రియా తెలుగులో న‌టించిన‌ మొద‌టి చిత్రం ఇదే కావ‌డం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రాహ్మణుడి పాత్రలో న‌టించ‌గా, న‌జ్రియా క్రిస్టియ‌న్ అమ్మాయిగా చేసింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం అందించాడు.

నేచురల్ స్టార్ నాని హీరోగా, నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా ‘అంటే సుందరానికి’. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జూన్‌ 10వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్ర టీజర్‌‌ రిలీజ్‌ ఈవెంట్‌ బుధవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. అంతేకాదు, టీజర్‌‌కు మంచి రెస్పాన్స్‌ కూడా వచ్చింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌మీట్‌లో నాని చేసిన కామెంట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కన్నడ ప్రేక్షకులు నానిపై మండిపడుతున్నారు.

టీజర్ రిలీజ్‌ తర్వాత ప్రెస్‌మీట్ జరిగింది. ఈ సమావేశంలో ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు హీరో నాని   చెప్పిన సమాధానం ఈ వివాదానికి తెరలేపింది. మూడు భాషల్లో రిలీజ్‌ చేస్తున్న ‘అంటే సుందరానికి’ సినిమాను కన్నడలో ఎందుకు రిలీజ్ చేయడం లేదు అని నానిని ఒక జర్నలిస్టు ప్రశ్నించాడు. ‘అంటే సుందరానికి’ సినిమాను కన్నడ భాషలో ప్రత్యేకంగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదని, కన్నడ, తెలుగు భాషలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి గనుక ప్రేక్షకులకు సులువుగా అర్ధం అవుతుందని నాని సమాధానమిచ్చాడు. కన్నడ భాషలో విడుదల చేయకపోయినా అక్కడి ప్రేక్షకులు కూడా తెలుగులో నే చూసి ఎంజాయ్‌ చేస్తారని చెప్పాడు. తెలుగు సినిమాలపై వాళ్లకు ఉన్న అభిమానం అటువంటిదని అన్నాడు.

ప్రెస్‌మీట్‌లో నాని చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు వీటిపై కన్నడ ప్రేక్షకులు తీవ్రంగా మండిపడుతున్నారు. నానిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ సినిమాను కన్నడ భాషలో డబ్బింగ్‌ చేసి రిలీజ్ చేస్తే చూస్తామని చెబుతున్నారు. వివాదం ముదురుతుండడంతో నేచురల్‌ స్టార్‌‌ నాని (Nani) .. కన్నడ ప్రేక్షకులకు క్షమాపణలు చెబుతూ ట్వీట్‌ చేశాడు. తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చాడు. కన్నడ డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేకున్నా తాను యాక్ట్ చేసిన తెలుగు సినిమాలను కన్నడ ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారని మాత్రమే చెప్పానని.. తన మాటలను సోషల్‌ మీడియాలో వక్రీకరించారని ట్వీట్‌లో నాని పేర్కొన్నాడు. వేరే ఉద్దేశంతో తాను ఆ కామెంట్లు చేయలేదని అన్నాడు.

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!