Movie Review: రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదాల ‘శాకిని డాకిని’.. రొటీన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్
సినిమా పేరు : శాకిని డాకిని
నటీనటులు : రెజీనా కసాండ్రా, నివేదా థామస్
మ్యూజిక్ : మైకి మెక్‌క్లారీ, నరేష్ కుమారన్
నిర్మాతలు : దగ్గుబాటి సురేష్‌బాబు, తాటి సునీత, హున్యూ థామస్ కిమ్
దర్శకత్వం: సుధీర్ వర్మ
విడుదల తేదీ : 16–09–2022
రేటింగ్ : 2.5 / 5
హీరోయిన్లు రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘శాకిని డాకిని’. ‘మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ సినిమాకి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. కొరియన్ వెర్షన్‌లో మేల్ సెంట్రిక్‌గా తెరకెక్కించిన ‘శాకిని డాకిని’ సినిమా టాలీవుడ్ రీమేక్‌లో మాత్రం ఫీమేల్ సెంట్రిక్‌గా రూపొందించారు.
శాకిని డాకిని సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో రెజీనా, నివేదా మాత్రమే కనిపించారు. ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు సృష్టించాయి. శాకిని డాకిని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రెజీనా చేసిన కామెంట్లు సినిమా పబ్లిసిటీని పెంచాయి. శాకిని డాకిని సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందా లేదా పరిశీలిద్దాం..
కథ ఏంటంటే:
పోలీస్ ట్రైనింగ్‌కు సెలక్ట్ అవుతారు దామిని (రెజీనా కసాండ్రా), షాలిని (నివేదా థామస్). వీరిద్దరికీ ముందునుంచే ఒకరంటే ఒకరికి పడదు. పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ సమయంలో కూడా ఎప్పుడూ కొట్టుకుంటూ.. తిట్టుకుంటూనే ఉంటారు. అదే క్రమంలో మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇదిలా ఉండగా.. వాళ్లిద్దరై చూస్తుండగానే కొందరు దుండగులు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు.
కళ్లెదుటే కిడ్నాప్ అయిన అమ్మాయిని కాపాడడం ట్రైనీ పోలీసులుగా ఉన్న తమ బాధ్యత అని ఫీలవుతారు దామిని, షాలిని. ఈ క్రమంలో ఆ అమ్మాయిని కాపాడడంలో మొదటిసారి ఫెయిలవుతారు. అయితే, ఆ అమ్మాయిని కాపాడడంతోపాటు హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్‌ను ఏ విధంగా పోలీసులకు పట్టించారు అనేది శాకిని డాకిని సినిమా కథ.
ఎవరు ఎలా నటించారంటే :
తెలంగాణ యాసలో మాట్లాడుతూ, చబ్బీగా, అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో అలరించారు నివేదా థామస్. ఇక, రెజీనా కసాండ్రా కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. నటనపరంగా రెజీనాకు పేరు పెట్టలేం. నటిగా మంచి మార్కులే వేయించుకున్నారు. సుదర్శన్, హేమంత్, చమ్మక్ చంద్ర, రవివర్మ, కబీర్ సింగ్, వారివారి క్యారెక్టర్లకు న్యాయం చేశారు.
దర్శకుడు సుధీర్ వర్మ మార్క్ మేకింగ్, ఎడిటింగ్ టాలెంట్ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ఆయన సినిమాల్లో కనిపించే ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే మిస్ అయ్యింది. కొరియన్ కథ కావడంతో మన నేటివిటీకి తగినట్టుగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది. ఫస్టాఫ్‌లో రెజీనా, నివేదా మధ్య జరిగే సన్నివేశాలు, కథతో సినిమా చూస్తున్నంత సేపూ సరదాగా, ఆసక్తిగా ఉంటుంది. అయితే ఆ ఆసక్తి సెకండాఫ్‌లో మిస్ అయ్యింది.
పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పాజిటివ్ టాక్ తెచ్చే రేంజ్‌లో లేవు. యాక్షన్ సీన్స్, రాత్రి సమయంలో తీసిన సన్నివేశాల్లో క్లారిటీ లేకపోవడంతో ఆసక్తిసన్నగిల్లుతుంది. సెకండాఫ్‌లో కథలోని లాజిక్, స్క్రీన్‌ప్లేకు పొంతన కుదరలేదు.
ప్లస్ పాయింట్స్ :
రెజీనా (Regina Cassandra), నివేదా యాక్టింగ్
నివేదా (Nivetha Thomas) డైలాగ్స్, లుక్స్
మైనస్ పాయింట్స్ :
స్ర్కీన్‌ప్లే, ఎడిటింగ్ సరిగ్గా లేకపోవడం
ఒక్క మాటలో.. మెప్పించలేకపోయిన ‘శాకిని డాకిని’
Read More : Regina Cassandra: క్యారెక్టర్ నచ్చితే దానికి న్యాయం చేయడానికి ఎంతైనా కష్టపడతా: రెజీనా కసాండ్రా