ఉత్కంఠగా రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) నటించిన ‘శాకిని డాకిని’ టీజర్‌

Updated on Aug 23, 2022 05:04 PM IST
రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas)  కలిసి నటిస్తున్న సినిమా శాకిని డాకిని
రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas) కలిసి నటిస్తున్న సినిమా శాకిని డాకిని

రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్‌ (Nivetha Thomas) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘శాకిని డాకిని’. దక్షిణ కొరియా చిత్రం ‘మిడ్‌నైట్‌ రన్నర్‌’కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్‌ కిమ్‌ నిర్మాతలు. సెప్టెంబర్‌ 16న ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో శాకిని డాకిని టీజర్‌‌ను విడుదల చేశారు మేకర్స్‌. టీజర్‌ ప్రకారం శాలిని (నివేదా థామస్‌) ఫుడ్‌ లవర్‌కాగా, దామిని(రెజీనా)కి ఓసీడీ సమస్య ఉంది. ఇద్దరూ పోలీసు అకాడమీలో ట్రైనీలుగా జాయిన్‌ అవుతారు. శిక్షణా శిబిరంలో ఇద్దరూ తక్కువ పనితీరు  కనబరుస్తున్నారు.

రెజీనా కసాండ్రా (Regina Cassandra), నివేదా థామస్ (Nivetha Thomas)  కలిసి నటిస్తున్న సినిమా శాకిని డాకిని

వినోదం కూడా ఉన్నట్టే..

అనవసరమైన విషయాల్లో గొడవలు పెట్టుకుంటున్నట్టుగా టీజర్‌‌లో చూపించారు. ఒక అమ్మాయిని నేరస్తుడు తలపై కొట్టినట్టుగా కూడా చూపించారు. అప్పటివరకు ట్రైనింగ్‌పై ఇంట్రెస్ట్‌ లేనట్టుగా ఉన్న వీళ్లిద్దరూ కేసు విషయంలో తమ తెలివితేటలను ఎలా చూపించారనేది కూడా చూపించే ప్రయత్నం చేశారు. 

టీజర్‌ ప్రకారం శాకిని డాకిని సినిమాలో వినోదం, యాక్షన్, బలమైన కథ, డ్రామా  ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్రిల్లర్‌లను హ్యాండిల్ చేయడంలో స్పెషలిస్ట్‌ అయిన సుధీర్ వర్మ శాకిని డాకిని సినిమా సబ్జెక్ట్‌ను డీల్ చేయడంలో తనదైన మార్క్ చూపించారని టీజర్‌‌ ద్వారా అనిపిస్తోంది. రెజీనా (Regina Cassandra), నివేదా (Nivetha Thomas) యాక్టింగ్‌ సినిమాకు హైలైట్‌గా నిలిచేలా ఉంది.

Read More : Regina Cassandra: పొట్టి డ్రెస్ లో రెజీనా కసాండ్రా.. కొత్త సినిమా షూటింగ్ లో సందడి చేసిన హాట్ బ్యూటీ!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!