మెగాపవర్‌స్టార్ రాంచరణ్ (RamCharan) తర్వాత సినిమా కన్నడ దర్శకుడితో చేయనున్నారా?
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ (RamCharan) తాజాగా శంకర్ డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ఘన విజయంతో చరణ్‌కు సౌత్‌తోపాటు నార్త్‌లో కూడా క్రేజ్ పెరిగింది. ఈ క్రమంలో శంకర్ సినిమాపై అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఆర్‌సీ15 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాంచరణ్ లుక్స్ కొత్తగా అనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రాంచరణ్ సినిమా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. కమల్ హాసన్ ఇండియన్2 సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే రాంచరణ్ (RamCharan) తర్వాత సినిమాపై పలు వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
క్లారిటీ రావాలంటే..
చరణ్ ఆర్‌సీ16 సినిమాకు డైరెక్టర్ ఎవరు అనే దానిపై క్లారిటీ రాలేదు. ఆర్‌సీ15 తర్వాత జెర్సీ సినిమాను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో చేయాల్సి ఉంది. అయితే హిందీలో తెరకెక్కించిన జెర్సీ సినిమా ఫ్లాప్ కావడంతో గౌతమ్‌ను పక్కన పెట్టినట్టు టాక్.
దీంతో మరోసారి ఆర్‌సీ16 డైరెక్టర్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌తో వకీల్ సాబ్ వంటి సూపర్‌హిట్ సినిమాను తెరకెక్కించిన వేణు శ్రీరామ్‌తో సినిమా చేయడానికి చెర్రీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్.
అలాగే కన్నడ దర్శకుడు నారథన్‌తో సినిమాకు రాంచరణ్ (RamCharan) ఓకే చెప్పారని కూడా వార్తలు వస్తున్నాయి. వీటిలో ఏది నిజమో తెలియాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడక తప్పదు.
Read More : జేమ్స్‌బాండ్‌గా హాలీవుడ్‌కి మెగా పవర్‌స్టార్ రాంచరణ్ (RamCharan).. ఆనందంలో మెగా అభిమానులు!