‘అధర్వ’ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ రిలీజ్ చేసిన మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja).. హైలైట్‌గా హీరో డైలాగ్స్‌

Updated on Aug 29, 2022 09:25 PM IST
సినిమా షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉండే మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) అధర్వ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు
సినిమా షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉండే మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) అధర్వ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు

వరుసగా సినిమాలను లైన్‌లో పెట్టి వాటిని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు రవితేజ (RaviTeja). అదే సమయంలో కొత్త హీరోలను, ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉన్న వాళ్లను సపోర్ట్‌ చేయడంలో కూడా ముందుంటారు రవితేజ. ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు రవితేజ.

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘అధర్వ’. క్రైమ్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న అధర్వ సినిమాకు మహేష్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి అధర్వ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్.

సినిమా షూటింగ్స్‌లో బిజీబిజీగా ఉండే మాస్‌ మహారాజా రవితేజ (RaviTeja) అధర్వ సినిమా మోషన్‌ పోస్టర్‌‌ను ఆవిష్కరించారు

డైలాగ్స్‌ హైలైట్‌గా..

అధర్వ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌‌ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించే వరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న  డైలాగ్స్ మోషన్ పోస్టర్‌‌లో హైలైట్‌గా నిలుస్తున్నాయి.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. అధర్వ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక, గగన్ విహారి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక, రవితేజ (RaviTeja) హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌ సీన్స్‌ కోసం భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను మేకర్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది.

Read More : Tiger Nageswara Rao : రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్‌ నాగేశ్వరరావు’ చిత్రంలో.. అనుపమ్ ఖేర్‌కు కీలక పాత్ర !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!