మనసుకు హత్తుకునే సినిమా ‘మేజర్’.. ట్వీట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun).. థ్యాంక్స్ చెప్పిన అడివి శేష్‌

Updated on Jun 04, 2022 11:03 PM IST
అల్లు అర్జున్ (Allu Arjun), అడివి శేష్
అల్లు అర్జున్ (Allu Arjun), అడివి శేష్

26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన ఆర్మీ ఆఫీసర్ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం మేజర్‌. సందీప్‌ పాత్రలో యంగ్‌ హీరో అడివి శేష్‌ నటించాడు. సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ హీరోయిన్లు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించిన మేజర్‌‌ సినిమాను సూపర్‌‌స్టార్‌‌ మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏ ప్లస్‌ మూవీతో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిలిం ఇండియా నిర్మించింది. జూన్‌ 3న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళుతోంది. ఈ సినిమాపై ఇప్పటికే పలువురు ప్రశంసల వర్షం కురిపించగా.. తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) కూడా మేజర్‌‌ సినిమా సూపర్‌‌ అంటూ ట్వీట్‌ చేశాడు.

మేజర్‌‌ సినిమాపై అల్లు అర్జున్ ట్వీట్

అల్లు అర్జున్ ట్వీట్‌కు అడివి శేష్‌ రీ ట్వీట్

'మేజర్‌ టీమ్‌కు శుభాకాంక్షలు. సినిమా మనసుకు హత్తుకునేలా ఉంది. మ్యాన్‌ ఆఫ్‌ ద షో అడివి శేష్‌ వెండితెరపై మరోసారి మ్యాజిక్‌ చేశాడు. ప్రకాష్‌రాజ్‌, రేవతి, సయీ మంజ్రేకర్‌, శోభిత ధూళిపాళ, ఇతర నటీనటులు అద్భుతంగా నటించారు. శ్రీచరణ్‌ పాకాల అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ అదిరిపోయింది. డైరెక్టర్‌ శశికిరణ్‌ తిక్కా సినిమాను అద్భుతంగా, అందంగా మలిచాడు. గుండెల్ని పిండేసే సినిమాను అందించిన నిర్మాత మహేష్‌బాబుకు ప్రత్యేక అభినందనలు. ప్రతి భారతీయుడి గుండెను తాకే గొప్ప సినిమా మేజర్‌' అంటూ ట్వీట్‌ చేశాడు బన్నీ.

అల్లు అర్జున్‌ (Allu Arjun) చేసిన ట్వీట్‌కు అడివి శేష్‌ స్పందించాడు. 'క్షణం నుంచి మేజర్‌ వరకు మీరు చూపించిన ప్రేమ, అందించిన సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నా పుట్టినరోజున (డిసెంబర్‌ 17) పుష్ప గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు మేజర్‌ విజయాన్ని మరింత అందంగా మలిచారు' అని రిప్లై ఇచ్చాడు శేష్.

Read More: అడివి శేష్ హీరోగా తెరకెక్కిన మేజర్.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!