Sarkaru Vaari Paata (సర్కారు వారి పాట): అక్రమార్కుల భరతం పట్టే సూపర్ ఆఫీసర్ కథ

Updated on May 01, 2022 06:13 PM IST
ప్ర‌పంచ అంద‌గాళ్ల‌లో ఒక‌రు ప్రిన్స్ మ‌హేష్ బాబు. ద‌క్షిణాది నుంచి వ‌ర‌ల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ 2021లో ప‌దో స్థానంలో నిలిచి... అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. మాములుగా మ‌హేష్ సినిమా అంటే అభిమానులు ఆనందంలో మునిగి తేల‌తారు. ఇక ప్ర‌పంచ అంద‌గాడైన త‌ర్వాత వ‌స్తున్న 'స‌ర్కారు వారి పాట'  సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. గీతా గోవిందం సినిమా డైరెక్ట‌ర్ పరుశురామ్ పెట్లా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత  అంటే.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 
ప్ర‌పంచ అంద‌గాళ్ల‌లో ఒక‌రు ప్రిన్స్ మ‌హేష్ బాబు. ద‌క్షిణాది నుంచి వ‌ర‌ల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ మెన్ 2021లో ప‌దో స్థానంలో నిలిచి... అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. మాములుగా మ‌హేష్ సినిమా అంటే అభిమానులు ఆనందంలో మునిగి తేల‌తారు. ఇక ప్ర‌పంచ అంద‌గాడైన త‌ర్వాత వ‌స్తున్న 'స‌ర్కారు వారి పాట'  సినిమాపై భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. గీతా గోవిందం సినిమా డైరెక్ట‌ర్ పరుశురామ్ పెట్లా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత  అంటే.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. 

ప్ర‌పంచ అంద‌గాళ్ల‌లో ఒక‌రు ప్రిన్స్ మ‌హేష్ బాబు.  WORLDS MOST HANDSOME MEN అనే జాబితాలో మన దక్షిణాది నుండి ప‌దో స్థానంలో నిలిచి, అరుదైన గౌర‌వం ద‌క్కించుకున్నారు. మాములుగా మ‌హేష్ సినిమా అంటే అభిమానులు ఆనందంతో మునిగితేలుతారు. ఇక ఈయన ప్ర‌పంచ అంద‌గాడైన త‌ర్వాత వ‌స్తున్న సినిమా 'స‌ర్కారు వారి పాట'. అందుకే ఈ చిత్రంపై  అభిమానులు భారీ అంచ‌నాలే పెట్టుకున్నారు. గీత గోవిందం సినిమా డైరెక్ట‌ర్ పరుశురామ్ పెట్లా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

స్టైలిష్గా క‌నిపిస్తున్న మ‌హేష్..

సినిమా సినిమాకు మ‌హేష్ కొత్త‌గా క‌నిపిస్తారు. అందంగా కూడా అనిపిస్తారు. స‌ర్కారు వారి పాట సినిమాలో మ‌హేష్ స్పెష‌ల్ లుక్‌లో తెర‌పై మెరిసిపోనున్నారు. మెడ‌కి, చేతికి ఓం ఆకారంలో ఉన్న లాకెట్ వేసుకున్నారు. చెవికి పెట్టుకున్న రింగ్ స్టైలిష్‌గా ఉంది. రూపాయి సింబ‌ల్ టాటూ కూడా ఓ స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా కనిపిస్తోంది. మరి ఆ టాటూ ర‌హ‌స్యం ఏంటో సినిమా రిలీజ్ అయ్యాక చూడాల్సిందే. 

కీర్తీ సురేష్ లుక్

మ‌హాన‌టిలో కొంచెం బొద్దుగా ఉన్న కీర్తి సురేషే ఈ మ‌ధ్య చాలా స్లిమ్‌గా మారింది. ప్రిన్స్ మ‌హేష్ స‌ర‌స‌న న‌టించేందుకే కీర్తి అలా మారిందా? అనేది ప్రస్తుతం అభిమానులు వేసుకుంటున్న ప్రశ్న. ఎందుకంటే, మ‌హేష్ ప‌క్క‌న  'క‌ళావ‌తి' పాట‌లో ఆమె స్లిమ్‌గా, చాలా బాగుంది.  అలాగే మేక‌ప్, డ్రెస్సుల డిజైన్ విష‌యాల్లో కీర్తి సురేష్ స్పెష‌ల్ కేర్ తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. 

సినిమా డైరెక్ట‌న్.. 

స‌ర్కారు వారి పాట సినిమాను ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ యాక్ష‌న్ ప్ల‌స్ రొమాంటిక్ సినిమాగా తెర‌కెక్కించారు. ఆయన గత చిత్రం గీతగోవిందం నిదానంగా సాగిపోయే ప్రేమ క‌థ‌. కానీ స‌ర్కారు వారి పాట సినిమా అలా కాదు. అందులోనూ ప్రిన్స్ సినిమా. యాక్ష‌న్ సీన్స్.. సాంగ్స్.. నేషనల్ అవార్డు గ్రహీత కీర్తీ సురేష్.. ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌హేష్ అభిమానులు.. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని సినిమా తీయ‌డ‌మంటే ఓ సాహ‌స‌మే. సినిమా పోస్ట‌ర్ చూస్తుంటే, అలాంటి సాహ‌సాన్ని ద‌ర్శ‌కుడు ప‌రుశురామ్ చేశార‌నే మనకు అనిపిస్తుంది. 

సినిమా క‌థ ఎలా సాగ‌నుంది ?

ఓ బ్యాంక్ కుంభ‌కోణం చుట్టూ క‌థ సాగుతుంద‌ని తెలుస్తుంది. బ్యాంక్ మేనేజ‌ర్ కొడుకుగా మ‌హేష్ త‌న తండ్రిపై ప‌డిన నింద‌ను ఎలా తొలిగిస్తార‌నేది కథ. అలాగే మ‌హేష్ డ్యుయల్ రోల్  చేస్తున్నార‌ని టాక్. మ‌హేష్ గారాల ప‌ట్టి సితార కూడా స‌ర్కారు వారి పాట‌లో న‌టించార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

మ్యూజిక్ బాస్ త‌మ‌న్

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త‌మ‌న్ రూపొందించిన క‌ళావ‌తి పాట ప్రేమికుల రోజు రిలీజ్  చేశారు. ఆ పాట యూట్యూబ్‌లో చెల‌రేగిపోతోంది. అనంత శ్రీరామ్ ఈ పాటను రాశారు. ఆ తర్వాత వచ్చిన ‘పెన్సీ’ సాంగ్ కూడా య్యూటూబ్‌లో దూసుకెళ్తోంది. మ‌రిన్ని హిట్ పాట‌లుంటాయ‌ని ఎదురుచూస్తున్నారు అభిమానులు. 

‘సర్కారు వారి పాట’ ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, త‌మిళ్ , క‌న్నడ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రానుంది.  మహేష్ బాబు తదుపరి సినిమాలు త్రివిక్రమ్‌తో పాటు రాజమౌళితో కూడా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు సర్కారు వారి పాట చిత్రాన్ని తొలిసారి ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. ఆ త‌ర్వాత కూడా ఇదే ఫాలో అవచ్చని అనుకుంటున్నారు మహేష్ టీమ్.  అలాగే స‌ర్కారు వారి పాట వరుస అప్డేట్స్‌తో.. ప్రస్తుతం ఫ్యాన్స్ పండుగ చేసుకోనున్నారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!