మహేష్ బాబు (Mahesh Babu) : అమ్మకు ప్రేమతో అంటున్న టాలీవుడ్ ప్రిన్స్
ప్రిన్స్ మహేష్ బాబుకు తన తల్లి ఇందిరా దేవీ అంటే ఎంతో అభిమానం. ఏప్రిల్ 20 తన తల్లి పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో ఆయన ఓ ఫోటో షేర్ చేశారు.
ఆ ఫోటో ఎవరిదో కాదు. తన తల్లి ఇందిరాదేవిదే. ఆ ఫోటోను షేర్ చేసి మహేష్ బాబు ఆమెకు బర్త్‌డే విషస్ తెలిపారు. తనను ఎప్పుడూ ఆశీర్వదించే అమ్మకు థాంక్స్ అని కూడా చెప్పారు. అమ్మను కేవలం ఒక్క బర్త్ డే రోజే కాకుండా,. ఎల్లప్పుడూ అభిమానిస్తానని ఇన్ స్టాలో మహేష్ పోస్ట్ చేశారు.
అలాగే మహేష్ బాబు గారాలపట్టి సితార కూడా నానమ్మతో దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. హ్యాపీ బర్త్‌డే నానమ్మ .. నీలా మరెవరు ఉండరని చెబుతూ, ఓ సందేశాన్ని కూడా పోస్ట్ చేసింది.